ఆ మ‌హిళ‌ను 20 ఏళ్లుగా చీక‌టి గ‌దిలో బంధించారు. ఎందుకో తెలుసా? త‌రువాత ఏమైందంటే…!

నేటి స‌మాజంలో మ‌నుషుల ప‌ట్ల కొంద‌రు మ‌నుషులు ప్రవ‌ర్తిస్తున్న తీరుకు వారిని ఏమ‌నాలో నిజంగా అర్థం కావ‌డం లేదు. కొందరు ఇత‌రుల‌ను దారుణంగా చంపి హ‌త్య చేస్తుంటే, ఇంకొంద‌రు తోటి మ‌నుషులు అని కూడా చూడ‌కుండా దారుణంగా చిత్ర హింస‌ల‌కు గురి చేస్తున్నారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయే సంఘ‌ట‌న కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఓ మ‌హిళ‌ను సొంత కుటుంబ స‌భ్యులే చీక‌టి కూపంలో బంధించారు. అది కూడా ఒక‌టి, రెండు రోజులు, నెల‌లు కాదు. ఏకంగా కొన్ని సంవ‌త్స‌రాల పాటు ఆమెను బంధించారు. ఈ మ‌ధ్య‌నే ఆమెను ఓ ఎన్‌జీవో గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు ఆమెను బ‌య‌ట‌కు తీసుకొచ్చారు.

ఆమె పేరు సునిత వెర్లెక‌ర్‌. ఉంటున్న‌ది గోవాలోని ప‌నాజి వ‌ద్ద ఉన్న కండోలిమ్ అనే గ్రామం. అయితే గ‌త 20 ఏళ్ల కింద‌ట ఆమెకు ముంబైకి చెందిన ఓ వ్య‌క్తితో వివాహం అయింది. కాగా కొద్ది రోజులు బాగానే సాగిన సునిత కాపురంలో గొడ‌వలు మొద‌ల‌య్యాయి. భ‌ర్త వేరే మ‌హిళ‌తో సంబంధం పెట్టుకోవ‌డంతో ఆమె భ‌ర్త‌ను వ‌దిలి పుట్టింటికి వ‌చ్చింది. అయితే భ‌ర్త క‌న్నా పుట్టింటి వారు పెట్టిన టార్చ‌రే ఆమెకు అధిక‌మైంది. ఆమె ప్ర‌వ‌ర్త‌న బాగా లేద‌ని, మ‌తి స్థిమితం లేద‌ని చెప్పి పుట్టింటి వారు ఆమెను త‌మ ఇంటి వెనుక ఉన్న ఓ చిన్న చీక‌టి గ‌దిలో బంధించారు.

అలా సునిత గ‌త 20 సంవ‌త్స‌రాలుగా అదే చీక‌టి గ‌దిలో బందీ అయి ఉంది. అందులోకే ఆమెకు ఆహారం పంపేవారు. లోప‌ల ఆమె ఎలా ఉందో కూడా వారు చూడ‌లేదు. బ‌య‌ట తాళాలు పెట్ట‌డంతో ఆమెకు బ‌య‌ట‌కు రావడానికి వీలు కాలేదు. కాగా సునిత గురించి ఓ ఎన్‌జీవోకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు స‌మ‌చారం ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారు సునిత ఇంటికి చేరుకుని చీక‌టి గ‌దిలో బందీ అయి ఉన్న ఆమెను విడిపించారు. అనంత‌రం వెల్ఫేర్ హౌజ్‌కు పంపారు. ప్ర‌స్తుతం సునిత‌కు హాస్పిట‌ల్‌లో చికిత్స అందుతోంది. కాగా సునితను ఇలా చేసిన ఆమె కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిజంగా ఇలాంటి వారిని ఏం చేయాలో తెలియ‌దు కానీ, చ‌ట్టంలో కొత్త శిక్ష‌లు తేవాలి..!

Comments

comments

Share this post

scroll to top