రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్స్ ( RCB) IPL నుండి నిష్క్రమించింది.! రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ సేన ఇంటిబాట పట్టింది. ఇప్పటికే SRH, CSK ఫ్లే ఆఫ్ కు చేరిన నేపథ్యంలో మరో రెండు జట్లు బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఏ టీమ్స్ కు ఫ్లే ఆఫ్ కు చేరుకుంటాయో ఓ సారి చూద్దాం.
1 KKR:
ఫ్లే ఆఫ్ కు చేరే అవకాశం పుష్కలంగా ఉన్న టీమ్ KKR, ఇప్పటికే 14 పాయింట్స్ తో టేబుల్ థర్డ్ ఫ్లేస్ లో ఉన్న KKR కు మరో మ్యాచ్ మిగిలివుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే డైరెక్ట్ ప్లే ఆఫ్ కు వెళ్తుంది. మరీ ఘోరంగా ఓడిపోకుండా తన నెట్ రన్ రేట్ కాపాడుకుంటే చాలు.
2) MI or RR:
రేపు జరగబోయే మ్యాచ్ లో ముంబాయ్ DD మీద గెలిస్తే డైరెక్ట్ గా ఫ్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే ప్లే ఆఫ్ ఛాన్స్ RR కు వెళుతుంది.
3) KXIP:
KXIP ఫ్లే ఆఫ్ కు చేరాలంటే…. MI వర్సెస్ DD మ్యాచ్ లో MI ఓడిపోవడంతో పాటు…. CSK తో జరిగే మ్యాచ్ లో KXIP భారీ తేడాతో గెలవాలి…అప్పుడు KXIP ఫ్లే ఆఫ్ ఛాన్స్.