జీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ సుభాష్ చంద్ర ఏ ముహూర్తాన దేశీయ జట్లతో టోర్నమెంట్ ప్రారంభించాడో అదే ఇవాళ ఇండియాను ఊపేస్తోంది. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా దానిని ఆపి వేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని దేశం నుండి వెళ్లి పోయిన లలిత్ మోడీ చేసిన ప్రయత్నమే ఇండియన్ ప్రిమియర్ లీగ్ అదే ఐపీఎల్. ఈ దేశంలో ఏ ఆటకూ లేనంత పిచ్చి క్రికెట్ ఆటకే ఉన్నది. కోట్లాది అభిమానులు క్రికెట్ అంటే పడి చస్తున్నారు. ఏ రోజైతే బీసీసీఐ టోర్నీలను నిర్వహిస్తోందో ఇక సినిమాలు ఆడడం లేదు. వ్యాపారాలు నడవడం లేదు. కాలేజీలలో స్టూడెంట్స్ చదవడం మానేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, యజమానులు , ఐటీ కంపెనీలు, రెస్టారెంట్స్ లలో ఐపీఎల్, ప్రపంచకప్, వన్డే, టెస్ట్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇంకో వైపు ఐటీ సెక్టార్ పై తీవ్ర ప్రభావం చూపడంతో ..గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐటీ కంపెనీల ఓనర్స్ ..కూర్చున్న చోటనే మ్యాచ్లను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
అంతేకాకుండా ఆయా నగరాలలో ఒకవేళ క్రికెట్ మ్యాచ్ జరిగితే..ఆయా మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉచితంగా టికెట్లను కూడా అందజేస్తున్నారు. జగన్మోహన్ దాల్మియా పుణ్యమా అంటూ క్రికెట్ కు విపరీతమైన ఆదాయం తీసుకు వచ్చేలా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్కు ఆదరణ పెరిగేలా చేశారు. కోట్లాది రూపాయలు కలిగిన బీసీసీఐకి ఎక్కడలేనంత డిమాండ్ పెరిగింది. ఇపుడు ప్రపంచాన్ని ఇండియన్ క్రికెట్ బోర్డుకు గణనీయమైన ఆదాయం లభించింది. వేలం పాటల ద్వారా..మ్యాచ్ల నిర్వహణ , ఇతర దేశాలతో వన్డే , టెస్ట్ మ్యాచ్లు, మధ్యలో టోర్నీలు ఇలా..చెప్పుకుంటూ పోతే ..కోట్లు..డాలర్లను దాటేసింది బీసీసీఐ. భారత దేశానికి కరువు వస్తే ఓ పదేళ్లకు పైగా అందరికి కావాల్సిన డబ్బులను సమకూర్చే సత్తా ఈ బోర్డుకు ఉందని మేధావి వర్గాలు పేర్కొనడం..దాని సత్తా ఏ పాటిదో అర్థమై పోతుంది. బీసీసీఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.
తాము ఎవ్వరి మాట వినమంటూ ..తీసుకున్న నిర్ణయాలపై ఒంటెద్దు పోకడను అనుసరించిన ఛైర్మన్, కార్యదర్శిలకు సుప్రీంకోర్టు ధర్మాసనం మెట్టికాయలు వేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఏ సంస్థ అయినా..వ్యక్తి అయినా..అందరూ దాని పరిధిలోకి రావాల్సిందేనంటూ పేర్కొంది. ఒక్క ఐపీఎల వేలం పాటల ద్వారా లక్ష కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఆయా మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పోటీ పడ్డాయి. ఇండియాలోని దిగ్గజాలు, వ్యాపార వేత్తలు, సినీ స్టార్స్ ఆయా జట్లకు యాజమాన్యాలుగా ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్లను చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.
అందుకే బీసీసీఐ దీనిని టార్గెట్ చేసింది. ఒక్కో జట్టు 12 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇపుడు ఐపీఎల్ ఫీవర్ పట్టేసింది. స్టార్ గ్రూపు సంస్థల ఛైర్మన్ అండ్ సిఇఓ ఉదయ శంకర్ ఏకంగా 1648 కోట్లకు పైగా వెచ్చించి..వేలం పాటలో ఐపీఎల్ ప్రసార హక్కులను చేజిక్కించుకున్నారు. వరల్డ్ వైడ్ గా డిమాండ్ కలిగిన ఫుట్ బాల్ జట్టు కంటే ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్లకు కోట్లు పలికాయి. ఊహించని రీతిలో తరాలకు సరిపడా ధనం సమకూరింది బీసీసీఐకి. మొత్తం మీద జనం క్రికెట్ మీద పెంచుకున్న అభిమానం ..కోట్లను కురిపిస్తోంది..