IPL లో ఎంపైర్స్ శాల‌రీ ఎంతో తెలుసా? తెలిశాక‌…ఎంపైరైనా బాగుండేద‌ని బాధ‌ప‌డ‌కండి.!

IPL ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత‌ కాస్ట్లీ గేమ్.! ఆట‌గాళ్ళ కొనుగోలు ద‌గ్గ‌రి నుండి చీర్ లీడ‌ర్ల డాన్స్ వ‌ర‌కు ప్ర‌తిదీ కాస్టే.! ఇక ఆట‌గాళ్ళు ధ‌రించిన జెర్సీ మొద‌లు….బౌండ‌రీ లైన్స్ మీద రోప్ వ‌ర‌కు ఇంచు కూడా వ‌ద‌ల‌కుండా అడ్వ‌ర్టైజ్ మెంట్లు….టోట‌ల్ గా కోట్ల గేమ్ ఇది. మ‌రి ఇంత‌టి మెగా టోర్నీకి ఎంపైర్స్ గా వ్య‌వ‌హ‌రించే వారికి కూడా ఇదే మొత్తంలో పైకం అందుతుంది. అస‌లు ఒక్కో ఎంపైర్ కి ఏ రేంజ్ లో శాల‌రీ ల‌భిస్తుందో చూద్దాం.!

గ‌తంలో టోర్న‌మెంట్ మొత్తానికి ప్యాకేజ్ గా మాట్లాడుకునే వారు..కానీ ఇప్పుడు మాత్రం మ్యాచ్ మ్యాచ్ కు ఎంపైర్స్ కు ఫీజ్ ను చెల్లుస్తున్నారు IPL నిర్వాహ‌కులు.

  • కుమార ధ‌ర్మ‌సేన ( శ్రీలంక )., S ర‌వి ( ఇండియా) వీరిద్ద‌రికీ మ్యాచ్ కు 1ల‌క్షా 75 వేల రూపాయ‌లను చెల్లిస్తారు. కీల‌క మ్యాచ్ ఎంప‌రింగ్ బాధ్య‌త‌ల‌ను వీరికే అప్ప‌గిస్తారు. టోర్న‌మెంట్ ముగిసేట‌ప్ప‌టికీ వీరిద్ద‌రి సంపాధ‌న కోటికి పైనే.

  • ఇక‌… అనిల్ చౌద‌రి, షంషుద్దీన్ , CK ఆనంద్…ఈ ముగ్గురు ఎంపైర్స్ కి టోర్న‌మెంట్ మొత్తం అయ్యే స‌రికి ఒక్కొక్క‌రి…అకౌంట్లో 40 ల‌క్ష‌ల‌కు పైగానే క్రెడిట్ అవుతాయి.

  • థ‌ర్డ్ ఎంపైర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించే వారికి., మ్యాచ్ రిఫ‌రీగా వ్య‌వ‌హ‌రించే వారికి టోర్న‌మెంట్ మొత్తం ముగిసేవ‌ర‌కు 26 ల‌క్ష‌ల‌ను చెల్లిస్తారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌వ‌గ‌ల్ శ్రీనాధ్ మ్యాచ్ రిఫ‌రీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top