#IPL-2018 విన్న‌ర్ ఎవ‌రు.? విశ్లేష‌ణ‌.

Azhar

IPL-2018 ఫైన‌ల్ కు వ‌చ్చేసింది. టేబుల్ టాప‌ర్స్ గా నిలిచిన CSK, SRH జ‌ట్లే ఫైన‌ల్స్ లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ తుది స‌మ‌రంలో గెలుపెవ‌రిది..? టీమ్స్ బ‌లాబ‌లాలేంటి.? మ‌్యాచ్ ను డిసైడ్ చేసే ఫ్యాక్ట‌ర్స్ ఏంటి..? అనేది ఓ సారి క్షుణ్ణంగా ప‌రిశీలిద్దాం.

టాస్ యే కీల‌కం.
ఈ ఫైన‌ల్ మ్యాచ్ విన్నింగ్ ను డిసైడ్ చేసే అంశాల్లో ప్ర‌ధాన‌మైనది టాస్ యే.!
టాస్ గెలిచిన జ‌ట్టు ఖ‌చ్చితంగా ఫీల్డింగ్ నే ఎంచుకుంటుంది… వాంఖండే స్టేడియం కాబట్టి మొద‌ట్లో పిచ్ కాస్త ఫేస్ బౌల‌ర్స్ కు అనుకూలిస్తుంది. రెండు జ‌ట్ల‌లో కూడా మెరుపు బౌల‌ర్స్ ఉన్నారు… CSK కు ఎంగిడి మంచి స్పెల్స్ ను కొన‌సాగిస్తున్నాడు. మొద‌ట SRH బౌలింగ్ కు దిగితే మాత్రం భువ‌నేశ్వ‌ర్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శ‌ర్మ ల ఎటాకింగ్ బౌలింగ్ CSK ను కోలుకోలేని దెబ్బ‌తీస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

హిట్ట‌ర్లు హిట్ అయితే మ్యాచ్ వ‌న్ సైడే.!

  • వాంఖండే స్టేడియం బౌండ‌రీ చిన్న‌ది కావ‌డంతో … హిట్ట‌ర్లు రాణిస్తే ప‌రుగుల వ‌ర‌ద పారే అవ‌కాశం ఉంది. ఇరు టీమ్స్ లో హిట్ట‌ర్ల‌ను చూస్తే CSK కు కాస్త ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. ధోని, రాయుడు , బ్రేవో, రైనా, వాట్స‌న్ , డుప్లెసిస్ లు సెట్ అయితే మ్యాచ్ వ‌న్ సైడే.!
  • SRH బ్యాటింగ్ పూర్తిగా ధావ‌న్, విలియ‌మ్ స‌న్ మీదే ఆధార‌ప‌డుంది….మ‌నీష్‌, యూసుఫ్ లు ఇప్ప‌టి వ‌ర‌కు పేరుకు త‌గ్గ ఆట‌ను ప్ర‌ద‌ర్శించ‌లేదు… బ్రాత్ వైట్ ఒక్క‌టే SRH లో పెద్ద హిట్ట‌ర్ అని చెప్పొచ్చు.

స్పిన్

ఈ డిపార్ట్మెంట్ లో మాత్రం SRH దే పూర్తి ఆదిప‌త్యం.! మిస్ట‌రీ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్, ఆల్ రౌండ‌ర్ ష‌కిబుల్ హ‌స‌న్ లు ఒంటిచేత్తో మ్యాచ్ ను తిప్పేస్తారు. CSK జ‌డేజానే ఆధారం… ఈ మ్యాచ్ లో ఇమ్రాన్ తాహిర్ కు ఛాన్స్ ఉండ‌క‌పోవొచ్చు.!వీరి ప్ర‌ద‌ర్శ‌ను కీలం.

SRH లో….

  • కెప్టెన్ క‌న్సిస్టెంట్..కేన్ విలియ‌మ్ స‌న్… IPL-2018లో 688 ప‌రుగులు చేసి టాప‌ర్ గా ఉన్నాడు. 8 హాఫ్ సెంచ‌రీలు చేసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ రోజు ఇత‌ని నుండి మ‌రో కీల‌క ఇన్నింగ్స్ ఆశించొచ్చు.!
  • ర‌షీద్ ఖాన్- KKR మ్యాచ్ తో ర‌షీద్ SRH హీరో అయ్యాడు. త‌నదైన గూగ్లీల‌తో ప్ర‌త్య‌ర్థి టీమ్ కు ఎలా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తాడో చూడాలి.!

CSK లో..

  • IPL-2018 4 సెంచ‌రీలు న‌మోదైతే అందులో రెండు CSK ప్లేయ‌ర్స్ చేసిన‌వే…( అంబ‌టి రాయుడు, షేన్ వాట్స‌న్ ) ….బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ వారి అండ‌…ఒక‌రు కాక‌పోతే ఒక‌రు టీమ్ ను విజ‌య‌తీరాల‌కు చేర్చే స‌త్తా ఉన్న వారే.!
  • ఎంగిడి ఎటాకింగ్ బౌలింగ్.

బ‌లాబ‌లాలు.
ఈ IPL లో ఇప్ప‌టి వ‌ర‌కు SRH త‌ల‌ప‌డిన మూడు మ్యాచెస్ లో CSK నే గెలిచింది. కానీ గెలిచిన ప్ర‌తి మ్యాచ్ చాలా క‌ష్టం మీద గెలిచ‌న‌వే.!

ఈ మ్యాచ్ లో గెలుపెవ‌రిది…?
SRH దే.

Comments

comments