గత 11 ఐపీఎల్ సీజన్ లలో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సాధించిన ప్లేయర్స్ వీరే.!!

ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకి పండుగ, సిక్స్ లు ఫోర్ లు హై స్కోర్ లు, అబ్బో,,, క్రికెట్ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఏ ఎంటర్టైన్మెంట్. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఐపీఎల్ ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ఐపీఎల్ వల్ల ఎందరో ప్లేయర్స్ కి లైఫ్ వచ్చింది, ఫారిన్ ప్లేయర్స్ మొదలు ఇండియన్ ప్లేయర్స్ వరకు ఎందరికో లైఫ్ ఇచ్చింది ఐపీఎల్.

ఐపీఎల్ 12 వ సీజన్ మార్చి 23 నుండి ప్రారంభం కానుంది, మొదటి మ్యాచ్ చెన్నై లో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ V/S రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. ధోని V/S కోహ్లీ అంటే భారత క్రికెట్ అభిమానులకి భలే ఇష్టం, రెండు పెద్ద టీం లు మొదటి మ్యాచ్ నుండే తలపడనుండటం తో ఈ సారి ఆరంభం ఏ అదిరిపోనుంది.

గడిచిన 11 ఐపీఎల్ సీజన్ లలో ప్రతి సంవత్సరం ఎక్కువ పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ ని సొంతం చేసుకున్న బ్యాట్సమెన్ లు వీరే… :

2008 – షాన్ మార్ష్ (పంజాబ్) :

మొదటి ఐపీఎల్ సీజన్ లోనే అందరిని అధిగమించి మొదటి స్థానం లో నిలిచాడు షాన్ మార్ష్. ఆస్ట్రేలియా కు చెందిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్సమెన్ 11 మ్యాచ్ లలో 616 పరుగులు సాధించాడు.

2009 – మ్యాథ్యు హేడెన్ (చెన్నై) :

రెండవ ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్సమెన్ గా మ్యాథ్యు హేడెన్ ప్రధమ స్థానం లో నిలిచాడు. ఆస్ట్రేలియన్ టీం డ్యాషింగ్ ఓపెనర్ గా పేరు పొందిన మ్యాథ్యు హేడెన్, ఐపీఎల్ లో కూడా అదే ఊపు చూపించి చెన్నై టీం లో డ్యాషింగ్ ఓపెనర్ గా పేరు సంపాదించాడు. 2009
లో 12 మ్యాచ్ లలో 572 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2010 – సచిన్ టెండూల్కర్ (ముంబై) :

సచిన్ గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ క్రికెట్ ప్రేమికులకు దేవుడు. ఐపీఎల్ లో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన మొదటి భారత బ్యాట్సమెన్ గా రికార్డు నెలకొల్పాడు. 2010 లో ఆడిన 15 మ్యాచ్ లలో 618 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు.

2011 – క్రిస్ గేల్ (బెంగుళూరు) :

విధ్వంసకర వెస్ట్ ఇండీస్ బ్యాట్సమెన్ గేల్ పేరు వింటేనే బౌలర్ల గుండెలో దడ మొదలవుతుంది. టెస్ట్ అయినా, వన్ డే అయినా, టీ 20 అయినా గేల్ కి భయపడని బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున 2011 లో ఆడిన 12 మ్యాచ్ లలో 608 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2012 – క్రిస్ గేల్ (బెంగుళూరు) :

వరుసగా రెండో సారి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు క్రిస్ గేల్. 2012 లో ఆడిన 15 మ్యాచ్ లలో 733 పరుగులు సాధించాడు.

2013 – మైక్ హస్సీ (చెన్నై) :

మిస్టర్ క్రికెట్ గా పిలువబడే ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ మైక్ హస్సీ ఐపీఎల్ లో తన ప్రతిభను చాటుకున్నాడు. మైక్ హస్సీ 2013 లో ఆడిన 16 మ్యాచ్ లలో 733 పరుగులు సాధించాడు.

2014 – రాబిన్ ఉతప్ప (కోల్కత్త) :

సచిన్ తరువాత ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఇండియన్ ప్లేయర్ రాబిన్ ఉతప్ప నే. నైట్ రైడర్స్ టీం కి వెన్నుముక్క లా నిలబడి ఐపీఎల్ ట్రోఫీ గెలవడం లో కీలక పాత్ర పోషించాడు రాబిన్ ఉతప్ప. 2014 లో ఆడిన 16 మ్యాచ్ లలో 660 పరుగులు సాధించాడు.

2015 – డేవిడ్ వార్నర్ (హైదరాబాద్) :

సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి ఆయువు పట్టులా మారాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా జట్టులోనే కాకుండా ఐపీఎల్ లో కూడా కన్సిస్టెంట్ ప్లేయర్ గా పేరు దక్కించుకున్నాడు. 2015 లో ఆడిన 14 మ్యాచ్ లలో 562 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2016 – విరాట్ కోహ్లీ (బెంగుళూరు) :

ఇండియన్ టీం లో సచిన్ నెలకొల్పిన రికార్డులను తిరగరాయడానికి పుట్టినట్లు ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ, ఐపీఎల్ లో ఇంత వరకు ఒక సీజన్ లో ఎవరు సాధించలేనన్ని పరుగులు కోహ్లీ సాధించాడు. 2016 లో ఆడిన 16 మ్యాచ్ లలో ఏకంగా 973 పరుగులు సాధించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు విరాట్ కోహ్లీ, 2016 సీజన్ లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.

2017 – డేవిడ్ వార్నర్ (హైదరాబాద్) :

2015 నుండి ఐపీఎల్ లో భీకర ఫార్మ్ కొనసాగించాడు డేవిడ్ వార్నర్. హైదరాబాద్ టీం బ్యాటింగ్ రూపు రేఖల్నే మార్చేశాడు డేవిడ్ వార్నర్, 2017 లో ఆడిన 14 మ్యాచ్ లలో 641 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

2018 – కేన్ విలియంసన్ (హైదరాబాద్) :

వార్నర్ స్థానం లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ని ముందుండి నడిపించాడు ఈ న్యూజీలాండ్ బ్యాట్సమెన్, అద్భుతమైన ప్రదర్శన తో అందరిని ఆశ్చర్యపరిచాడు కేన్ విలియంసన్. 2018 లో ఆడిన 17 మ్యాచ్ లలో 735 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top