ఐపీఎల్ – 11 లో సరికొత్త రూల్..! ఎప్పుడైనా ఆటగాళ్లు ఏ టీం లోకైనా మారొచ్చు..కానీ షరతు ఏమిటంటే.?

ఐపీఎల్ లో సరికొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఆ నిబంధనల ప్రకారం ఎంపికైన ఆటగాడికి ఆ టీమ్ తరఫున ఆడేందుకు అవకాశం రాకపోతే.. అతను వేరే టీమ్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. నిన్నటి బీసీసీఐ – ఐపీఎల్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఐపీఎల్‌-11లో దీన్ని అమల్లోకి తీసుకురానున్న కూడా తెలుస్తోంది. ఈ నిర్ణయానికి ప్రాంచైజీ యజమానులు అంగీకరించారని కూడా అంటున్నారు.

యూరోపియన్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌(ఈపీఎల్‌)లో ఇలాంటి అవకాశం ఉంటుంది. ఆ విధానాన్ని ‘మిడ్‌ డే టోర్నమెంట్‌ ప్లేయర్‌ ట్రాన్స్‌ఫర్‌’ అంటారు. ఈపీఎల్‌ నిబంధనల ప్రకారం జట్టులోని ఆటగాడికి సీజన్‌లో జరిగే తొలి ఏడు మ్యాచుల్లో అవకాశం ఇవ్వకుంటే నిరభ్యంతరంగా ఇతర జట్లలోకి వెళ్లవచ్చు. అయితే ఇతర జట్టు అవకాశం కల్పించినపుడే ఇది సాధ్యమవుతుంది. ఇదే నిబంధన ఐపీఎల్‌-11 సీజన్‌లో అమలు చేయాలని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top