యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ X ను ఐఫోన్ 10 అనాలా, ఎక్స్(X) అనాలా ? కరెక్ట్ ఏంటో చూడండి.!

యాపిల్ సంస్థ ఈ మ‌ధ్యే త‌న ప్ర‌తిష్టాత్మ‌క ఐఫోన్ X ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నెల 3వ తేదీ నుంచే ఈ ఫోన్ అమ్మ‌కాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. భార‌త్‌లోనూ ఈ ఫోన్ ప్ర‌స్తుతం ల‌భిస్తున్న‌ది. ఈ ఫోన్‌కు చెందిన 64 జీబీ వేరియెంట్ రూ.89వేలు ఉండ‌గా, 256 జీబీ వేరియెంట్ ధ‌ర రూ.1.02 ల‌క్ష‌లుగా ఉంది. అయితే ఇంత వ‌రకు బాగానే ఉంది, కానీ ఈ ఫోన్ పేరును ప‌ల‌క‌డంలోనే వినియోగ‌దారుల‌కు చాలా మందిలో సందేహం నెల‌కొంది. అదేమిటంటే… ఐఫోన్ X ను ఐఫోన్ ఎక్స్ అని పిల‌వాలా, లేక రోమ‌న్ నంబ‌ర్ ప్ర‌కారం 10 ( X అంటే రోమ‌న్ సిస్ట‌మ్‌లో 10) అని పిల‌వాలా అని చాలా మంది క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారు. మ‌రి ఈ ఫోన్‌ను ఎలా పిలవాలి, దీనికి క‌రెక్ట్ ప్ర‌నౌన్సియేష‌న్ ఏది ? అంటే.. అందుకు సమాధాన‌మే ఇది..!

గ‌తంలో వ‌చ్చిన ప‌లు మోటోరోలా ఫోన్లను ఎక్స్ సిరీస్‌లో ఉండేవి. ఇక మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ క‌న్సోల్ కూడా ఎక్స్ బాక్స్ అని వ్య‌వ‌హ‌రించ‌బ‌డుతోంది. దాంతోపాటు యాపిల్ కంప్యూట‌ర్స్‌లో మాక్ ఓఎస్ ఎక్స్ అని ఉంటుంది. అందుకనే చాలా మంది ఐఫోన్ X ను ఐఫోన్ ఎక్స్ అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. అయితే కొంద‌రు దీన్ని ఐఫోన్ 10 అని పిలుస్తుండే స‌రికి యూజ‌ర్ల‌లో సందేహాలు వ‌స్తున్నాయి. దీంతో యాపిల్ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చింది. దాని ప్ర‌కారం.. అస‌లు ఐఫోన్ Xను ఐఫోన్ 10 అనే పిల‌వాలి. ఐఫోన్ ఎక్స్ కాదు.

ఎందుకంటే యాపిల్ మొద‌టి ఐఫోన్‌ను విడుద‌ల చేసింది 2007లో. ఆ త‌రువాత అనేక ఐఫోన్ మోడ‌ల్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే 2017తో ఐఫోన్‌కు 10 ఏళ్లు నిండాయి. దీంతో ద‌శాబ్ది కానుక‌గా ఐఫోన్ Xను యాపిల్ విడుద‌ల చేసింది. క‌నుక దీన్ని ఐఫోన్ 10 అని పిల‌వాలి, కానీ ఐఫోన్ ఎక్స్ అని కాదు. కాబ‌ట్టి తెలిసింది క‌దా, క‌నుక మీరు ఐఫోన్ X ను ఐఫోన్ 10 అని పిల‌వండి, ఎక్స్ అని కాదు. ఎవ‌రైనా అలా పిలిస్తే ఇదే విష‌యం వారికి చెప్పండి..!

 

Comments

comments

Share this post

scroll to top