ఇంట్లో సింహం కాంస్య విగ్రహం పెట్టుకుంటే వాస్తు లాభాలన్నీ పొందవచ్చట!?

ఏ ఇంట్లో నివసించే వారైనా సుఖ సంతోషాలతో జీవించాలన్నా, అష్ట ఐశ్వర్యాలు కలగాలన్నా యజమానులు కష్టపడితేనే సాధ్యమవుతుంది. దీనికి తోడు సరైన రీతిలో వాస్తు పద్ధతులను కూడా పాటిస్తే జీవితం మరింత సుఖమయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తుకు మరింత బలాన్ని చేకూర్చేందుకు ఇంట్లో కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటే సరిపోతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1_1456829253
  • పెద్ద సైజ్‌లో ఉన్న సింహం కాంస్య విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే అది ఇంటి అంతటికీ పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేస్తుంది. దీంతోపాటు ఇంట్లోని వారికి ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తుంది. అయితే ఆ విగ్రహాన్ని ఈశాన్య దిశగా ఉంచితే మంచిది.
  • కిచెన్‌లో రెండు చిన్నవైన కాంస్య పాత్రలు లేదా, చిన్నవైన సింహం కాంస్య విగ్రహాలను ఆగ్నేయ దిశగా వేలాడదీస్తే ఆ ఇంట్లో శ్రేయస్సు సమృద్ధిగా లభిస్తుంది.
  • ఇంట్లో ఎల్లప్పుడూ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి.  ఇందుకోసం అవ‌స‌ర‌మైతే కంపాస్‌ను వాడాలి.
  • ఇంటికి ప్రధాన ద్వారం నోరు వంటిది. ఇది ఇంట్లోకి శక్తిని ప్రసారం చేస్తుంది.
  •  నైరుతి దిశలో ఉన్న తలుపు ద్వారా వెళ్లకూడదు. ఎందుకంటే ఇది దుష్ట శక్తులకు నిలయంగా ఉంటుంది. దీని గుండా వెళ్తే ఎల్లప్పుడూ కష్టాలు చుట్టుముడతాయి. దురదృష్టం వెంటాడుతుంది.
  • ఇంటి బయటి దిశగా ప్రధాన ద్వారానికి రెండు హనుమాన్ బొమ్మలను ఉంచాలి. ఇలా చేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు.

Note: వాస్తును నమ్మే వారి కోసం మాత్రమే.

Comments

comments

Share this post

scroll to top