లైవ్ ప్రోగ్రాంలో ఆ ఇద్దరు వేసిన జోక్ కి ఆమె పెద్దగా నవ్వేసరికి ఏమైందో తెలుసా..? చివరికి హాస్పిటల్ లో..!

టీవిలో చర్చా కార్యక్రమం జరుగుతుంది.యాంకర్ ఉత్సాహంగా ప్రశ్నలడుగుతుంటే..చర్చలో పాల్గొన్న వాళ్లు అంతే ఉత్సాహంగా చర్చ కంటిన్యూ చేస్తున్నారు..సడన్ గా నిండు గర్భిని అయిన యాంకర్ కు నొప్పులు రావడం హుటాహుటిన హాస్పటల్ కి తరలించడం..పండంటి బిడ్డకు జన్మనివ్వడం అంతా జరిగిపోయింది…ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

న్యూయార్క్‌ టీవీ ఛానెల్ లో నటాలియా పస్‌ క్వరెల్లా పేరున్న యాంకర్‌.ఇటీవల ట్విటర్‌లో పదాల పెంపుపై చర్చాగోష్టిని నిర్వహించగా దానికి నిపుణులు హాజరయ్యారు. వారిమధ్య కీలక సంభాషణ నడుస్తోంది. ఇంతలో చర్చలో పాల్గొన్న వ్యక్తి మాటలకు నవ్వు రావడంతో ఆపుకోకుండా పెద్దగా నవ్వేసింది నటాలియా.అంతే నిండు గర్భిణీ కావడంతో ఉమ్మనీరు బయటకు పోయింది.పరిస్థితి గమనించిన తను ఏ మాత్రం కంగారు పడకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ కి విషయం చెప్పింది.దాంతో ఆమెను హాస్పటల్ కు తరలించారు.పదమూడు గంటలపాటు ప్రసవవేధన పడి చివరకు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన బిడ్డకు జమీన్‌జేమ్స్‌ అని పేరు పెట్టారు నటాలియా దంపతులు. తన ఫ్యామిలీ ఫొటోను ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Comments

comments

Share this post

scroll to top