ఇంటర్వ్యూ కు వెళ్లేటప్పుడు పాటించాల్సినవి.

చాలా మంది చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల తమ చేతి దగ్గరికి వచ్చిన ఉద్యోగాలను కోల్పోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూ ల సమయంలో మన వాళ్ల దగ్గర ఉండే అతి భయమో లేక… అనుభవలేమో కానీ ..ముందు జాగ్రత్త లేకుండా వెళ్లి అక్కడ బిక్కమొహం వేస్తారు. ఉన్నదున్నట్టూ.. ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేట్టు మాట్లాడితే విజయం మనదే.

ఇంటర్వ్యూ కు ముందు చేయాల్సినవి:

 • మూడు రెజ్యూమ్లు.
 • మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
 • ఫోటో ఐడి విత్ జిరాక్స్.
 • మెయిల్ ఐడి పద్దతిగా ఉండాలి.. rockz…. shades అంటూ  తోకలు లేకుండా ఉంటే మంచిది.
 • ఫోన్ నెంబర్ నోటెడ్ ఉంచుకోండి.
 • కరెంట్ ఇష్యూ స్ మీద గ్రిప్ పెంచుకోండి.
 • డ్రెస్ సెన్స్ మంచిగా ఉండేలా చూసుకోండి.
 • ఆత్మనూన్యతా భావం ధరిచేరనివ్వకుండా ఉండండి

ఇంటర్వ్యూ లలో తరచూ అడిగే ప్రశ్నలు:

 • సెల్స్ ఇంట్రడక్షన్ ఇవ్వండి?
 • మీలోని బలాలు, బలహీనతలేవి?
 • మీ గోల్ ఎంటి?
 • ఇతరులలో మీకు నచ్చే గుణం ఏంటి?
 • ఈ జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు?
 • దీని కన్నా మంచి ఆఫర్ వస్తే ఏం చేస్తారు?
 • జాబ్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు?
 • మిమ్మల్ని ఈ జాబ్ లోకి తీసుకోవడం వల్ల మాకు కలిగే ఉపయోగం ఏంటి?

 

వీటిని దృష్టి లో పెట్టుకోండి.. మీ ఆటిట్యూడ్ అనేదే చాలా కీలకం. సబ్జెక్ట్ మీద,కరెంట్ ఇష్యూ స్ మీద  ఎంత పట్టు ఉంటే మీ ఇంటర్వ్యూ అంత సక్సెస్ ఫుల్ గా అవుతుంది.

All The Best…. మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ కు వెళితే అప్పుడు.

Comments

comments

Share this post

One Reply to “ఇంటర్వ్యూ కు వెళ్లేటప్పుడు పాటించాల్సినవి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top