ఇంటర్వ్యూకి వచ్చిన ఆ ఇద్దరమ్మాయిలు ఎవరో తెలుసా..? తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్లబెడతారు..!

ఒక చోట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి..అప్పుడే అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది.ఆటో లోనుండి ఒక పెద్దమనిషి, అతడితో పాటు ఇద్దరమ్మాయిలు దిగి ఇంటర్వ్యూ జరుగుతున్న ప్రదేశానికి నడుచుకుంటూ వస్తున్నారు.అంతే అప్పటివరకూ అక్కడ నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం ఒకసారిగా హడావిడిగా మారిపోతుంది..అధికారులు లేచి నిల్చుని ఆటోలో వచ్చిన వ్యక్తికి నమస్కారం పెట్టి ఆ ఇద్దరమ్మాయిలకు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం ఇవ్వడానికి రెడీ అవ్వబోతుంటారు..ఆ పెద్దమనిషి సున్నితంగా నమస్కరిస్తాడు..కట్ చేస్తే అతను  ఒక రాష్ట్రానికి సిఎం తండ్రి,ఆ ఇద్దరమ్మాయిలు ముఖ్యమంత్రి మేనకోడళ్లు అని తెలుస్తుంది..ఇలాంటి కథలు సినిమాల్లో అయితే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి.అదే నిజజీవితంలో జరిగితే…నిజంగా జరిగిందండీ ఉత్తరాఖండ్ లో..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో జాబ్ మేలా జరుగుతుంది.అక్కడికి ఆటోలో వచ్చిన తన ఇద్దరు మనమరాల్లతో వచ్చిన పెద్దమనిషి మరెవరో కాదు సిఎం యోగి ఆదిత్యనాధ్ తండ్రి ఆనంద్ సింగ్..ఇద్దరమ్మాయిలు యోగి మేనకోడళ్లు లక్ష్మీ రావత్,అర్చనలు.వారని చూసిన అక్కడి అధికారులు రాచమర్యాదలు చేయడం ప్రారంభించారు.దాంతో యోగి తండ్రి ఆ మర్యాదలను సున్నితంగా తిరస్కరించి తన మనమరాళ్లను లైన్లో అందరితో పాటు ఉద్యోగానికి పంపారు.అంతేకాదు తమకు ఎటువంటి మర్యాదలు చేయొద్దని సున్నితంగా చెప్పారు.ఇంటర్వ్యూలకు వెళుతుంటేనే వారికి ,ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కొనాలి,ఉద్యోగం ఎలా సంపాదించాలి అనేది తెలుస్తుంది.సిఫార్సు ద్వారా ఉద్యోగాలు తెచ్చుకుంటే ప్రతిభ ఉన్నవారి పరిస్తితి ఏంటి..ఒక వేళ నా కొడుకు వీరి ఉద్యోగాల గురించిసిపార్సు చేసినా నేను తిరస్కరిస్తాను అని అక్కడి మీడియాతో చెప్పారు ఆనంద్ సింగ్..

నిజమే కదా..ప్రతి ఒక్కరూ ఏదో ఒక రికమండేషన్ తో ఉద్యోగాలు తెచ్చుకుంటే నిజమైన ప్రతిభఉన్నవాళ్లు ఏ రికమండేషన్ లేక ఉద్యోగాలు లేక వెనకబడిపోతున్నారు.కొందరు ఉద్యోగాలు రావట్లేదనే బాదతో ప్రాణాలు తీసుకుంటున్నారు…అందరూ యోగి ఆదిత్యానాధ్ తండ్రి లా ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.

Comments

comments

Share this post

scroll to top