బిగ్ బాస్-2 లో ఎంట్రీ ఇచ్చిన నందినీ రాయ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..?

బిస్‌బాస్ లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. ఒక‌పైపు కామ‌న్ వుమెన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంజ‌నా ఔట్ అయింది. సంజ‌నా ఒక‌ప్ప‌టి మిస్ హైద‌రాబాదీ.

కానీ బిగ్‌బాస్ హౌజ్‌లో ఆమె ప్ర‌వ‌ర్త‌న ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదేమో. అందుకే ఆమెను ఎలిమినేషన్‌కు నామినేట్ చేసి బ‌య‌టికి పంపించారు.

సంజ‌నా ఎలిమినేష‌న్‌తో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చీ… అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది నందిని రాయ్‌. ఆమెకు మోడ‌లింగ్‌, న‌ట‌న‌లో మంచి బ్యాగ్ గ్రౌండ్ ఉంది.

ఇలా నందిని గురించి టాప్ 10 విష‌యాలు.

1.నందినీ రాయ్ అస‌లు పేరు నీల‌మ్ రాయ్‌ గౌరానీ. సింధి కుటుబానికి చెందిన నందిని హైద‌రాబాద్‌లోని సెంట్ ఆల్బాన్స్ స్కూల్ లో చ‌దివింది. లండ‌న్‌లో పైచ‌దువులు పూర్తి చేసింది.
2. చ‌దుపు పూర్త‌య్యాక మోడ‌లింగ్ వైపు దృష్టి పెట్టింన నందిని 2008లో కెరీర్ ప్రారంభించింది.
3 ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 80 బ్రాండ్స్ కోసం ప‌ని చేసింది.
4. ఈ ప‌దేళ్ల కెరీర్‌లో ఎన్నో అందాల పోటీల్లో టైటిల్ కైవ‌సం చేసుకుంది.
5. 2008లో మిస్ హైద‌రాబాద్‌గా ఎంపిక… 2009లో మిస్ ఫ్యాంటలూన్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకున్నారు.
6. 2010లో మిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ టైటిల్‌తో పాటు మిస్ బ్యూటిఫుల్ ఐస్ కితాబు కూడా ఆమెదే.
7 మోడ‌లింగ్ త‌ర్వాత న‌ట‌న‌పై దృష్టి పెట్టారు.
8. తెలుగులో మాయ‌, మోస‌గాళ్ల‌కు మోస‌గాడు ఇలా కొన్ని సినిమాల్లో న‌టించింది నందిని.
9. తెలుగుతో పాటు త‌మిళం, హిందీలో కూడా కొన్ని మూవీస్‌లో క‌నిపించింది.
10. ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేష్ హీరోగా వ‌స్తున్న సుడిగాడు 2లో న‌టిస్తోంది

Comments

comments

Share this post

scroll to top