ఆ విద్యార్థి చ‌దువుతున్న‌ది ఇంట‌ర్‌… అయిన‌ప్ప‌టికీ నెల‌కు రూ.12 ల‌క్ష‌ల వేత‌నంతో గూగుల్‌లో జాబ్ ల‌భించింది తెలుసా..!

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్‌లో జాబ్ రావాలంటే మాట‌లు కాదు. అందుకు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఎన్నో కోర్సుల‌పై గ్రిప్ సాధించాలి. పోటీ ప‌డే చాలా మందిలో నైపుణ్యం ఉన్న వ్య‌క్తులుగా ఆ కంపెనీకి క‌నిపించాలి. అప్పుడే గూగుల్ త‌న కంపెనీలోకి స‌ద‌రు వ్య‌క్తుల‌ను ఉద్యోగులుగా తీసుకుంటుంది. స‌రిగ్గా ఆ విద్యార్థిని కూడా గూగుల్ ఇలాగే ఎంపిక చేసింది. త‌న కంపెనీలో ఓ పోస్టుకు గాను పెట్టిన ప‌రీక్ష‌లో చండీగ‌డ్‌కు చెందిన ఓ ఇంట‌ర్ విద్యార్థి ప్ర‌తిభ‌కు గూగుల్ ఆశ్చ‌ర్య‌పోయింది. వెంట‌నే త‌న కంపెనీలో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా జాబ్ ఇచ్చేసింది. అత‌ను గూగుల్‌లో త్వ‌ర‌లో ప‌నిచేయ‌నున్నాడు. నెల‌కు రూ.12 ల‌క్ష‌ల వేత‌నం అందుకోనున్నాడు.

అత‌ని పేరు హ‌ర్షిత్ శ‌ర్మ‌. చండీగ‌డ్‌లోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో అత‌ను 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివాడు. త‌రువాత ఇంట‌ర్‌లో చేరాడు. అయితే అత‌నిది పేద కుటుంబం దీంతో ఓ వైపు ప‌నిచేస్తూనే మ‌రో వైపు చ‌దువు కొన‌సాగించేవాడు. ఈ క్ర‌మంలో అత‌ను ఆ వ‌య‌స్సులోనే గ్రాఫిక్ డిజైన్ వ‌ర్క్ నేర్చుకున్నాడు. అందులో త‌న స‌త్తా చాట‌సాగాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను సినీ న‌టుల పోస్ట‌ర్స్‌కు గ్రాఫిక్ వ‌ర్క్ చేస్తూ నెల‌కు రూ.40 వేల నుంచి రూ.50వేల వ‌ర‌కు ఆర్జించడం ప్రారంభించాడు. అదే స‌మ‌యంలో డిజిటల్ ఇండియా కార్య‌క్ర‌మంలో అత‌ను చూపిన‌ అత్యుత్తమ ప్రతిభగాను హర్షీత్‌ పీఎంవో కార్యాలయం నుంచి రూ .7వేలు బహుమతిని కూడా అందుకున్నాడు. అయితే హ‌ర్షిత్‌కు చిన్న‌ప్ప‌టి నుంచి గూగుల్‌లో జాబ్ చేయాల‌ని కోరిక‌గా ఉండేది.

ఈ క్ర‌మంలోనే గ్రాఫిక్ డిజైనర్ పోస్ట్‌ల‌కు గాను గూగుల్ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించ‌గా హ‌ర్షిత్ తాను గీసిన కొన్ని గ్రాఫిక్స్‌ను అటాచ్ చేస్తూ ఆ ఉద్యోగానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు. దీంతో గూగుల్ అత‌ని గ్రాఫిక్స్ వ‌ర్క్‌కు ఆశ్చ‌ర్య‌పోయింది. వెంట‌నే అపాయింట్‌మెంట్ లెట‌ర్ పంపింది. ఈ క్ర‌మంలో అత‌ను ఆగస్టు 7 న కాలిఫోర్నియాకు ట్రైనింగ్‌ నిమిత్తం వెళ్లనున్నాడు. ట్రైనింగ్‌లో హ‌ర్షిత్ నెల‌కు రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు స్ట‌యిఫండ్ అందుకోనున్నాడు. ట్రైనింగ్ పూర్త‌వ్వ‌గానే అత‌న్ని గూగుల్ రూ.12 ల‌క్ష‌ల నెల‌స‌రి వేత‌నంతో గ్రాఫిక్ డిజైన‌ర్‌గా నియ‌మించుకోనుంది. అవును మ‌రి, ప్ర‌తిభ ఉండాలే గానీ ఎవ‌రైనా అద్భుతాలు సాధించ‌వ‌చ్చు. ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల్లో ఉద్యోగాలు పొంద‌వ‌చ్చు కూడా..!

Comments

comments

Share this post

scroll to top