ఇంట‌ర్ దెబ్బ‌కు ఠారెత్తిన స్టూడెంట్స్

ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు 2019లో తెలంగాణ ప్ర‌భుత్వానికి తీర‌ని త‌ల‌వంపులు తెచ్చాయి. హెచ్ ఎండిఏ క‌మిష‌న‌ర్‌గా ఉన్న జ‌నార్ద‌న్ రెడ్డిని తీసుకు వ‌చ్చి విద్యా శాఖ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయినా విద్యా శాఖ తీరు మార‌లేదు. ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా త‌యారైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంట‌ర్ స్టూడెంట్స్‌, పేరెంట్స్ ఆందోళ‌న‌ల‌కు దిగినా క‌నీసం విద్యా శాఖ మంత్రి ఏ ఒక్క మాట మాట్ల‌డ‌క పోవ‌డం శోచ‌నీయం. కేజీ టు పీజీ అంటూ నెట్టుకు వ‌స్తున్న స‌ర్కార్ రిజ‌ల్ట్స్ విష‌యంలో ఇంత‌వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద పేరెంట్స్ ..బాధిత విద్యార్థులు భారీ ఎత్తున చేరుకున్నారు. త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ గగ్గోలు పెట్టారు. ఏకంగా కార్య‌ద‌ర్శి అశోక్ కుమార్‌పై దాడి చేసినంత ప‌నిచేశారు. అయినా చ‌ర్య‌లు లేవు.

గ‌తంలో అనుభ‌వం ఉన్న సంస్థ‌ను కాద‌ని వేరే శాఖ‌కు అప్ప‌గించ‌డం ..లెక్క‌లేన‌న్ని త‌ప్పులు దొర్ల‌డం..ర్యాంక‌ర్లు అనుకున్న స్టూడెంట్స్‌కు త‌క్కువ మార్కులు రావ‌డం..చాలా మంది ఫెయిల్ కావ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇంట‌ర్ శాఖ హ‌డావుడిగా ఈ ఫ‌లితాల‌ను ఎందుకు విడుద‌ల చేసిందో అశోక్ కే తెలియాలి. ఈ విష‌యం సీరియ‌స్ కావ‌డంతో ..అంత‌టా వ్య‌తిరేక‌త పెల్లుబుక‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్ఙితుల్లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోషి అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి జ‌నార్ద‌న్‌రెడ్డితో పాటు అశోక్ కుమార్ హాజ‌ర‌య్యారు. 140 మందికి పైగా విద్యార్థుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని వారి విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ కంటే ముందే ఏపీ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ర్యాంకులు కూడా డిక్లేర్ చేసింది.

ఈ రోజు వ‌ర‌కు ఒక్క ఫిర్యాదు రాలేదు అక్క‌డి పేరెంట్స్, స్టూడెంట్స్ నుండి. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెల‌కు పైగా గ‌డిచినా రిజ‌ల్ట్స్ కు సంబంధించి క్లారిటీ ఇవ్వ‌లేక పోయారు. ఇపుడు రేపు అంటూ నాన్చారు. పేరెంట్స్ నుండి ఒత్తిడి పెర‌గ‌డంతో హుటా హుటిన ఇంట‌ర్ రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టించారు. వాటిలో చాలా వ‌ర‌కు త‌ప్పుల త‌డ‌క‌లే. ఈ ఫ‌లితాల దెబ్బ‌కు ప‌రీక్ష‌లు త‌ప్పిన స్టూడెంట్స్ త‌ట్టుకోలేక ..చెప్పుకోలేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. 900 మార్కులు వ‌చ్చిన వారు సైతం ఫెయిల్ అయిన‌ట్టు ఇచ్చారు. మార్కుల‌కు బ‌దులు అర్థం ప‌ర్థం లేని సంకేతాల‌ను పొందు ప‌రిచారు. ఇంత జ‌రిగినా ఎలాంటి త‌ప్పులు దొర్ల‌లేద‌ని ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి చెప్పారు. ఏమైనా అనుమానాలు వుంటే డ‌బ్బులు చెల్లించి రీ వాల్యూయేష‌న్ చేయించుకోండ‌ని అశోక్ తాపీగా సెల‌విచ్చారు.

ఓ స్టూడెంట్ ఫ‌స్ట్ , సెకండ్ ఇయ‌ర్ అన్నీ పాస‌య్యాడు.. కానీ ఇంట‌ర్ మెమోలో మూడు స‌బ్జెక్టులు పోయాడ‌ని ఇచ్చారు. మెమోల్లో మార్కుల‌కు బ‌దులు ఏపీ, పీఎఫ్ అని ముద్రించారు. ఫ‌స్టియ‌ర్ లో 214 మందికి ఏపీ అని రాగా..ఇంగ్లీష్ లో 68 మంది, సంస్కృతంలో 78 మంది ఉన్నారు. సెకండియ‌ర్ లో 318కి ఏపీ అని రాగా..ఇంగ్లీష్ లో 100 మంది, సంస్కృతంలో 93 మంది ఉన్నారు. పి ఎల్ అంటే ఆబ్బెంట్ ఫెయిల్ అని పేర్కొన‌డం వారి ప‌నితనాన్ని తెలియ చేస్తోంది. ఏపీ కి అర్థః ఏమిటంటే స‌మాధానం చెప్ప‌లేక పోయారు. ఇంట‌ర్ బోర్డు అధికారుల నిర్వాహ‌కం దెబ్బ‌కు విద్యార్థులు ల‌బోదిబోమంటున్నారు. ఈ ఫ‌లితాలు వారి జీవితాల మీద తీవ్ర ప్ర‌భావం చూపించాయి.

Comments

comments

Share this post

scroll to top