ఓ చిన్న గ్రామంలో మెడికల్ షాప్ పెట్టుకున్న ఇతని గురించి తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.! శానిటరీ ప్యాడ్స్ విషయంలో..!

మనసుంటే మార్గం ఉంటుంది… ఆ మనసులో సమాజం పట్ల ఆర్తి ఉంటే మరో పదిమందికి మార్గం చూపగలిగే వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.సమాజానికి సేవ చేయాలంటే ముఖేష్ అంబానీ లా కోటానుకోట్ల కోటీశ్వరుడు కానక్కరలేదు… సాటి మనిషి సమస్య పట్ల స్పందించే గుణం, తమ స్థాయిలో ఆ స్పందనకు ఆచరణ రూపం ఇవ్వగలిగే నిబద్ధత ఉంటే చాలు అని నిరూపించారు- పాళీ.

అతడేం డబ్బున్న వ్యక్తి కాదు.. పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి అంతకన్నా కాదు.ఒక మామూలు దిగువ మద్యతరగతి కుర్రాడు.. అమ్మ,నాన్న,అక్క ఇది మల్లి కుటుంబం.ఊరు మన నేతన్నల సిరిసిల్ల..నాన్న వికలాంగుడు,అమ్మ గృహిణి,అక్క భర్త పోవడంతో పుట్టింటికి తిరిగొచ్చేసింది..చదువుకున్నది ఇంటర్మీడియట్ .అది కూడా ఎంతో కష్టపడి..అక్కడా ఇక్కడా పనులు చేసుకుంటూ అతి కష్టమ్మీద ఇంటర్ వరకు లాక్కొచ్చాడు.కానీ అప్పటికే జీవితాన్ని చాలా చదివేశాడు.అందుకే తనకు తోచినంతలో అనాధలకు సాయం చేస్తున్నాడు.కుటుంబ పోషణ కోసం సిరిసిల్లకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉండే మల్లారెడ్డిపేట్ అనే చిన్న గ్రామంలో మెడికల్ షాప్ పెట్టుకుని చూసుకుంటున్నాడు.ఇప్పటికే తన కవితలతో ఎందరినో కదిలించాడు..ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ విషయంలో తను తీసుకున్న చిన్న నిర్ణయంతో చాలామందికి స్పూర్తి అయ్యాడు..కేవలం ఫేస్బుక్లో పోస్టు చూసి , చలించి పెద్ద నిర్ణయం తీసుకున్న వ్యక్తి..రీల్ హీరో అక్షయ్ కుమార్ ప్యాడ్ మాన్ కథకి మురుగనాధం స్పూర్తి అయితే.. తన అక్కచెల్లల్ల బాదలు ఒక్కసారిగా కళ్లముందు కదిలి..తనకు తోచినంతలో సాయం చేయడానికి ముందుకొచ్చాడు పాళీ అలియాస్ మల్లేష్ లక్ష్మీ నారాయణ..

రుతుక్రమం..నెలనెలా రుతుక్రమం ద్వారా మన అమ్మలు,అక్కలు,చెల్లెల్లు ఎంతటి నరకయాతన అనుభవిస్తున్నారో మనందరికి తెలిసిందే..టెక్నాలజి ఇంత అభివృద్ది చెందింది.మహిళలు అన్నింటా ముందుంటున్నారు..కానీ ఈ విషయాన్ని మాత్రం ఇంటి గడప లోపలే అధిగమించలేకపోతున్నారు.దీనిపట్ల అవగాహన లేక ఎందరో అమ్మాయిలు ఇంకా బట్టలు వాడుతున్నారు.కొందరికి ప్యాడ్స్ కొనడం భారం అయితే మన ప్రభుత్వం ప్యాడ్స్ ని  12% జిఎస్టీ పేరుతో లగ్జరీ వస్తువుల కింద చేర్చి,మరింత దూరం చేస్తుంది.ఈ విషయం పట్ల అవగాహన కల్పించి ఉచితంగా పంపిణి చేయాల్సిన ప్రభుత్వం పన్నుల భారం మోపుతుంటే ఒక మామూలు పేద కుర్రాడు మాత్రం తనవంతుగా సాయం చేయడానికి ముందుకు వచ్చాడు.ఇప్పటి వరకు తన మెడికల్ షాప్ కి వచ్చే పేదవారికి తోచినంతలో సాయం చేస్తూ,ధర తగ్గిస్తు మందులు విక్రయిస్తున్న మల్లీ.ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ పై జిఎస్టీ లేకుండా అమ్ముతానని గర్వంగా చెప్పాడు.

” దేశంలోనే మొట్టమొదటి సారి తక్కువ రేటుకు #శానిటరీ_ప్యాడ్ ఇస్తున్న వ్వక్తి అరుణాచలం మురుగనాథం అయితే

“” మొట్టమొదటి సారిగా Gst టాక్స్ లేకుండా సానిటరీ ప్యాడ్స్ ఇస్తానన్న #పాళీ“” (మల్లేష్ లక్ష్మి నారాయణ)

Comments

comments

Share this post

scroll to top