20 వేల పెట్టుబ‌డి – 6 వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ – దేశీయ మొబైల్స్ అమ్మ‌కాల్లో రికార్డ్

ద‌మ్ముండాలి..మ‌న మీద న‌మ్మ‌కం వుండాలి..సాధించాల‌న్న క‌సి వుంటే చాలు ..కొండ‌ల్ని పిండి చేయొచ్చు. అద్భుత‌మైన విజ‌యాల‌ను అందుకోవ‌చ్చ‌న్న వాస్త‌వాన్ని న‌రేంద్ర బ‌న్సాల్ నిరూపించాడు. ఇది క‌ళ్ల ముందు క‌నిపించే గెలుపు క‌థ‌. కేవ‌లం 20 వేల సీడ్ కేపిట‌ల్‌తో ఇంటెక్స్ టెక్నాల‌జీస్ ను ఢిల్లీలో ఏర్పాటు చేశాడు. చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఇపుడు ఆయ‌న వ‌య‌స్సు 53 ఏళ్లు. 30 సంవ‌త్స‌రాల స‌మ‌యంలో త‌క్కువ ఖ‌ర్చు..ఎక్కువ నాణ్య‌త క‌లిగిన మొబైల్స్‌ను త‌యారు చేయ‌డంపై దృష్టి పెట్టారు. వేల రూపాయ‌ల‌తో ప్రారంభ‌మైన ఈ కంపెనీ బిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్‌ను దాటింది. 1996 -1997 సంవ‌త్స‌రంలో ఒక కోటి 18 ల‌క్ష‌ల రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తే…2015 -2016 సంవ‌త్స‌రానికి వ‌స్తే.. 6 వేల 400 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించి ఇండియ‌న్ మొబైల్ మార్కెట్‌ను ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది.

intext narendra bansal

ఇపుడు ఇంటెక్స్ టెక్నాల‌జీస్ కంపెనీలో 11, 000 వేల మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. 1986లో ఢిల్లీ యూనివ‌ర్శిటీలో గ్రాడ్యూయేష‌న్ పూర్తయ్యాక బ‌న్సాల్ ఢిల్లీ న‌గ‌ర‌మంతా తిరిగాడు. ఏం చేస్తే బావుంటుందోన‌ని ఆలోచించాడు. కుటుంబంతో క‌లిసి న‌వ్య బ‌జార్‌లో చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాడు. కార్డ్‌లెస్ ఫోన్ల‌ను అందించ‌డం ప్రారంభించాడు. ఎవ‌రైనా బుక్ చేస్తే ఫోన్ల‌ను అందించ‌డం వీరి బిజినెస్‌. చాందిని చౌక్‌లో చిన్న దుకాణం ఓపెన్ చేశాడు. మెల మెల్ల‌గా అమ్ముడు పోవ‌డం ఆదాయం వ‌చ్చింది. దీంతో మ‌న‌మే ఎందుకు మొబైల్స్ త‌యారు చేయ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఇంట‌ర్నెట్ వినియోగిస్తున్నారు. కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్‌లు, మొబైల్స్‌కు కావాల్సిన ప‌రిక‌రాలు – యాక్సెస‌రీస్‌ను త‌యారు చేస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌తో ఇంటెక్స్ ప్రాణం పోసుకుంది. ఆ అంకుర ఆలోచ‌న వేలాది మందికి కొలువులు క‌ల్పించే కంపెనీగా ఎదిగింది. ఇండియా వ్యాప్తంగా భారీ మార్కెట్ స్వంతం చేసుకుంది. ఇంటెక్స్ ద్వారా త‌యారైన ప‌రిక‌రాల‌కు మాంచి డిమాండ్ నెల‌కొంది. దీని వెనుక బ‌న్సాల్ కృషి ఉంది. 1996లో ఏకంగా 600 కోట్ల బిజినెస్ సాధించి రికార్డు సృష్టించారు.

సామాన్యులు కూడా అందుబాటులో మేం త‌యారు చేసే ప్ర‌తి ప్రొడ‌క్ట్‌. అదే మా స‌క్సెస్ అంటారు బ‌న్సాల్‌. మార్కెట్‌లో ప‌ది మొబైల్స్ అమ్ముడు పోతే అందులో మా డిఫ‌రెంట్ మోడ‌ల్స్ క‌నీసం మూడైనా ఉంటాయి..అదే మా ఆదాయాన్ని క‌లుగ చేస్తోందంటారు. దీంతో ఎందుకు మిగ‌తా వాటిని మ‌నం త‌యారు చేయ‌కూడ‌దా అన్న ఆలోచ‌న‌తో మ‌రిన్ని యాక్సెస‌రీస్‌పై కాన్‌సెంట్రేష‌న్ చేశాం. కంప్యూట‌ర్లు, ల్యాప్‌టాప్‌ల‌తో పాటు లెడ్ టీవీలు, ఇన్వ‌ర్ట‌ర్ల‌ను త‌యారు చేస్తున్నారు. ఫీచ‌ర్ ఫోన్స్ మార్కెట్‌లోకి విడుద‌ల చేశారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మ‌హేష్ బాబు లాంటి స్టార్స్‌తో యాడ్స్‌ల‌లో న‌టింప చేశారు. గ‌త రెండేళ్ల‌లో 40, 000 వేల మొబైల్ హ్యాండ్ సెట్స్‌ను అమ్మ‌గ‌లిగారు.

బ‌న్సాల్ కు ఇంటి వారి నుండే బెడ‌ద మొద‌లైంది. ఎందుకు ల్యాప్‌టాప్‌లు..లెడ్ టీవీలు..అంద‌రికీ అందుబాటులో ఉండేలా మొబైల్స్ త‌యారు చేయ‌లేమా అన్న ప్ర‌శ్న‌తో వ‌చ్చిన‌వే ఇంటెక్స్ 4జి మొబైల్స్‌. మార్కెట్‌లో నోకియా, బ్లాక్ బెర్రీ ఫోన్ల‌తో స‌మానంగా ఇంటెక్స్ ఫోన్లు అమ్ముడ‌వుతున్నాయి. ఇండియ‌న్స్‌కు ఫారిన్ నుండి వ‌చ్చే మొబైల్స్ ను ఎక్కువ‌గా కొనేందుకు ఎగ‌బ‌డతారు..కానీ భార‌త్‌లో త‌యారైన మొబైల్స్ అంటే దృష్టి పెట్ట‌రు. ఈవిష‌యం మార్కెట్ రీసెర్చ్ చేస్తే తెలిసింది అంటారు బ‌న్సాల్‌. ఆ గ్యాప్ ను గుర్తించి యూత్ అభిరుచుల‌కు అనుగుణంగా ఆకారంలోను..యాప్స్‌..సౌక‌ర్యాలు క‌ల్పించేలా మొబైల్స్ త‌యారు చేయ‌డంలో దృష్టి పెట్టారు. మొద‌ట‌గా వెహికిల్స్ కోసం బీ2బీ ప్లేయ‌ర్స్ త‌యారు చేశారు. న‌రేంద్ర బ‌న్సాల్ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. లేటెస్ట్ ఫీచ‌ర్స్‌తో మొబైల్స్ త‌యారు చేశాడు. 2012లో 1000 కోట్ల ట‌ర్నోవ‌ర్‌, 2015లో 3 వేల 600 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించి ఇత‌ర మొబైల్ కంపెనీల‌కు షాక్ ఇచ్చారు. 2016లో ఆరు వేల కోట్ల‌కు చేరుకుంది. ఇండియ‌న్ మార్కెట్‌లో ఇదో సంచ‌ల‌నం.

4జీ ఫోన్ల ధ‌ర‌లు మార్కెట్‌లో వేల‌ల్లో ఉన్నాయి. కానీ ప్ర‌తి ఒక్క‌రు కొనుగోలు చేసేలా స్మార్ట్ ఫోన్లు త‌యారు చేస్తే మార్కెట్‌లో వాటా చేజిక్కించు కోవ‌చ్చ‌ని మొబైల్స్ త‌యారు చేశారు. వాటి ధ‌ర‌లు 3000 వేల నుండి 3 వేల 500 రూపాయ‌ల మ‌ధ్య ధ‌ర‌లు ఉండేలా నిర్ణ‌యించారు. 2015లో మైక్రోమాక్స్ త‌ర్వాత సెకెండ్ లార్జెస్ట్ మొబైల్స్ కంపెనీగా ఇంటెక్స్ నిలిచింది. అహ్మ‌దాబాద్ ఐఐఎం స్టూడెంట్స్‌తో జ‌రిగిన స‌మావేశంలో బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా స‌మావేశపు హాలులోకి ఎంట‌ర్ అయ్యాడు బ‌న్సాల్‌. ప్ర‌తి చోటా అవ‌కాశం ఉంటుంది. దానిని గుర్తించి చేజిక్కించు కోవ‌డంలోనే ఉంటుంది అంటారు బ‌న్సాల్‌.

Comments

comments

Share this post

scroll to top