కలెక్టర్ అమ్రపాలి గారి చెల్లెలి గురించి ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా.? బీటెక్ టూ కలెక్టర్ ఎలా అంటే..?

అమ్ర‌పాలి… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియ‌ని వారు బ‌హుశా ఉండరేమో. ఎందుకంటే ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు. ప‌లు వివాదాలు ఈమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఈమె తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమెది ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లోని నర్సాపురం అగ్రహారం గ్రామం. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 39వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలుత వికారాబాద్‌లో శిక్షణ కలెక్టర్‌గా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు ఆప్షన్‌ ఇచ్చి ప్రస్తుతం కలెక్టర్‌గా తనదైన శైలిలో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

డైనమిక్‌ లేడీగా, యువ కలెక్టర్‌గా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమ్ర‌పాలి. ఇక‌ ఆమె చెల్లి మానస గంగోత్రి కూడా ఐఏఎస్‌కు ఎంపికై ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఇరువురూ విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా అమ్రపాలి చిన్నతనం నుంచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విశాఖ పట్నంలోని సత్యసాయి హైస్కూలులో ఆమె ప్రాథమిక, సెకండరీ విద్యను పూర్తి చేశారు. పాఠశాలలో నిర్వహించిన అన్ని పోటీల్లో పాల్గొంటూ అనేక బహుమతులు సాధించారు. పాఠశాలకు విద్యార్థి నాయకురాలిగా పనిచేశారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడోత్సవాలన్నింటిలో ఆమె పాల్గొని, అనేక బహుమతులు కూడా సాధించి తన సత్తా చాటారు.

అమ్రపాలి పదవ తరగతి పూర్తి అయ్యేనాటికే అంగ్లంపై పూర్తిస్థాయిలో పట్టుసాధించింది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాల్లో తండ్రితో పాటు ఆంధ్రాయూనివర్శిటీ గ్రంథాలయానికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి ఆంగ్ల సాహిత్య పుస్తకాలను అధ్యయనం చేస్తూ గడిపేవారు. అమ్రపాలి 16 ఏళ్ళకే అంగ్లంలో కథలు, పద్యాలు రాయడం ప్రారంభించారంటే ఆంగ్లపై ఎంత పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు. అంగ్ల సాహిత్యంపై ఆమె సాధించిన పట్టు ఐఏఎస్‌ ఎంపికకు ఆమెకు ఎంతో దోహదం చేసింది. అమ్రపాలిని బీటెక్‌ అయిన తర్వాత ఎంఎస్‌ కోసం అమెరికాకు పంపుదామని తల్లిదండ్రులు భావించారు. ఈ క్ర‌మంలోనే ఇంటర్మీడియేట్‌లో మంచి మార్కులు సాధించిన ఆమె చెన్నై ఐఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అయితే ఆఖరు నిమిషంలో అమెరికా వెళ్లాలన్న ప్రయత్నానికి పుల్‌స్టాప్‌ పెట్టి క్యాట్‌లో సాధించిన ర్యాంకుతో ప్రతిష్టాత్మక బెంగళూరు ఐఐఎంలో ఎంబీఏ సీటు రావడంతో ఎంబీఏలో చేరారు. ఎంబీఏ చివరి సంవత్సరంలో క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఆమె యూకేకు చెందిన ప్రముఖ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించారు.

ముంబాయిలోని యూకే బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేసిన అమ్రపాలి ఆ ఉద్యోగం నచ్చక ఏడాదికే రాజీనామా చేసింది. పేదలకు సాయం చేయాలి అనే ఆలోచనతో ఉన్న అమ్రపాలి యూపీఎస్‌సీ పరీక్షల వైపు దృష్టి సారించింది. అప్పటికే 2007లో ముంబయి ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన చెల్లెలు మానస గంగోత్రి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికైంది. ఆమె కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్చైజ్‌ శాఖను ఎంపిక చేసుకొని బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసిన అమ్రపాలి చెల్లెలి వద్దకు వెళ్లి యూపీఎస్‌సీ పరీక్షల్లో ఎలా నెగ్గాలో తెలుసుకున్నారు. ఐఏఎస్‌కు దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్‌ పాసైన అమ్రపాలి మెయిన్‌లో ఇంగ్లీషు లిటరేచర్‌, సైకాలజి సబ్జెక్టులను ఎంపిక చేసుకొని మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 39వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు.

ఐఏఎస్ అయిన అమ్ర‌పాలి మొద‌ట‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వికారాబాద్‌లో శిక్షణ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్‌ ఇచ్చిన అమ్రపాలిని మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తర్వాత ఆమెలోని ప్రతిభాపాటవాలను గుర్తించి జిల్లాల సంఖ్య పెరగ్గానే వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా నియమించారు. తర్వాత రూరల్‌ కలెక్టర్‌గా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఈనెల 18న అమ్రపాలి వివాహం జరగనుంది. 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన అమ్రపాలి 2011 బ్యాచ్‌ ఐసీఎస్‌ షమీర్‌ శర్మలు నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల అంగీకారంతో అందరి సమక్షంలో వివాహం చేసుకోవాలనుకున్న వారి క‌ల నెర‌వేరింది. షమీర్‌ శర్మ డయ్యూడామన్‌లో జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కాగా వీరి ఇరువురి పెళ్లి ఈనెల 18న జమ్మూలో జరగనుంది. అనంతరం ఈనెల 25న సికింద్రాబాద్‌లో రిసెప్షన్ జ‌ర‌గ‌నుంది.

Comments

comments

Share this post

scroll to top