కార్పేరేట్ స్థాయి చదువు, పూర్తి ఉచితంగా అందే మార్గం. ఇందులో సీట్ వస్తే పంట పండినట్టే.!

చదువు…చదువు..చదువు… ప్రస్తుతం తల్లీదండ్రుల అతిపెద్ద టెంక్షన్ పిల్లల చదువే. ధనవంతులైతే  లక్షల్లో డొనేషన్లు కట్టి  పెద్ద పేరున్న స్కూల్లో తమ పిల్లలను చదివిస్తారు, మరి పేద,మధ్య తరగతి పిల్లల చదువుల పరిస్థితి ఏంటి? పిల్లలు చదువు కోసమే తమ సంపాధనంతా ఖర్చు చేస్తున్నా రిజల్ట్ లో మాత్రం ఎటువంటి ఫలితం లేదని బాధపడుతున్న వారి సంఖ్యే ఎక్కువ. అలాంటి వారి కోసం కేంద్రీయ విద్యాలయాలు అండంగా నిలబడనున్నాయి. ప్రస్తుతం దాదాపు 12 లక్షలమంది,1100 కేంద్రీయ విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. భారత కేంద్ర ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ది శాఖ స్వయం ప్రాతిపదికన ఈ విద్యాలయాలు నడుపబడుతున్నాయి. ఈ స్కూల్స్ లో పిల్లలను చేర్చడం  పేరెంట్స్ కు సవాలులాంటిది. అయితే వీటి గురించి ఎక్కువ అవగాహన లేకపోవడమే దీనికి కారణం.

1627869935dscn8036

కేంద్రీయ విద్యాలయంలో చేరడానికి మార్గదర్శకాలు:

కేంద్రీయ విద్యాలయాలలో అడ్మిషన్ పొందాలంటే కొన్ని ప్రాధ్యాన్యతలు కలిగి ఉన్నాయి. మొదట ఈ విద్యాలయాలను సైనికుల పిల్లలకోసం నిర్మించినా, ఆ తర్వాత  కేంద్ర సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తుల  పిల్లలకు సైతం వీటిలో ప్రవేశం కల్పించారు. అయితే 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం , ఈ స్కూల్స్ లోని 25 % సీట్లు పేద పిల్లలకు కేటాయిస్తారు.

Main2

ఒకే అమ్మాయి ఉన్న వారికి  కూడా చెల్లించి ఫీజు నుండి మినహాయింపు ఉంది:

కేంద్రీయ విద్యాలయాలలో ఫీజు రాయితీ మరియు తక్కువ ఖర్చుకే అడ్మిషన్ ఉంటుంది. ఈ విధంగా రాయితీలు ఉంటాయి.

  • 1 . విద్యాలయ వికాస్ నిధి విద్యార్థినులకు ట్యూషన్  ఫీజు ఉండదు.
  • 2 . ఎస్సి /ఎస్టీ విద్యార్థినులకు మరియు, విద్యాలయ వికాస్ నిధి పిల్లలకు ట్యూషన్ ఫీజు ఉండదు
  • 3. సాయుధ దళాల వారికి, ఏదైనా ప్రభుత్వ పని చేస్తూ ప్రాణాలొదినవారి పిల్లలకు ఎటువంటి ఫీజు ఉండదు
  • 4.పేదరికం కంటే దిగువన ఉన్న వారు మరియు విద్యాలయ వికాస్ నిధి పిల్లలకు ట్యూషన్ ఫీజు ఉండదు.
  • 5.ఏకైక సంతానం కలిగిన వారి ఆడపిల్లలకు క్లాస్ 6 నుండి 12 తరగతి పిల్లలకు అన్నిరకాల ఫీజుల నుండి మినాహాయింపు ఉంటుంది.
  • FOR MORE INFO CLICK : HERE

Comments

comments

Share this post

scroll to top