ఇండో పాక్ యుద్ధ సమయంలో రాజీవ్ ఎక్కడికి పారిపోయారు.

భారత వైమానిక దళం… పాకిస్తాన్ ఉగ్రవాదులపై జరిపిన ఎయిర్ స్ట్రైక్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ నేతలు వాటికి సంబంధించిన ఆధారాలు కావాలని కోరడంతో ఇప్పుడు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ గా మారంది. 1971 లో ఇండో- పాక్ యుద్ధ సమయంలో రాజీవ్ గాంధీ అవసరం ఉన్నప్పుడు ఆయన భార్య పిల్లలతో కలిసి దేశాన్ని వదిలి ఇటలీ పారిపోయారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.


కానీ నిజానికి రాజీవ్ గాంధీ ఓ పైలట్ అంతే కానీ ఆయన యుద్ధ విమానాలు నడిపే వ్యక్తి కాదు. ప్రధాన మంత్రుల అధికారిక వెబ్ సైట్ ప్రకారం … ఆయన తన 40న ఏట భారత ప్రధాని అయ్యారు. 1971 ఇండో- పాక్ యుద్ధ సమయంలో ఇందిరా గాంధీ ఈ దేశ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో రాజీవ్ రాజకీయాల్లో లేరు. విమానాలు నడపడం హాబీ గా పెట్టుకున్న రాజీవ్ గాంధీ ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ నుంచి కమర్షియల్ ఫ్లయింగ్ లైసెన్స్ పొందారు.
1968 నుంచి ఇండియన్ ఎయిర్ లైన్స్ పైలట్ గా కెరీర్ ప్రారంభించిన రాజీవ్ గాంధీ… దాదాపు 10 ఏళ్ల పాటు పైలట్ గా కొనసాగారు. అంతే కానీ ఆయన భారత వైమానిక దళానికి చెందిన పైలట్ కాదు అని వెబ్ సైట్ చెప్తోంది. అంతే కానీ ఆయన యుద్ధ విమాన పైలట్ అని చెప్పడం అంతా ఒక నాటకం అని తేలింది.
ఆ వైరల్ మెసేజ్ ఆధారంగా 1971 యుద్ధ సమయంలో రాజీవ్ తన భార్య సోనియా గాంధీ, పిల్లలు (ప్రియాంక, రాహుల్ గాంధీ)తో కలిసి దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్న దాంట్లో ఏ మాత్రం నిజం లేదు. ఆ యుద్ధ సమయంలో రాహుల్ గాంధీ వయసు 6 నెలలు కాగా, అప్పటికి ప్రియాంక గాంధీ పుట్టలేదు. ఆ యుద్ధ సమయంలో రాజీవ్ పాత్ర లేనే లేదు. అదే విధంగా ఆ సమయంలో ఆయన తల్లి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె హయాంలోనే భారత సైన్యం పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించింది. కాబట్టి ఆమె కుమారుడిని ఏ విధంగా విమర్శిస్తారని పలువురు అంటున్నారు.

Comments

comments

Share this post

scroll to top