150 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ బ‌ద్ద‌ల‌వుతున్న ఏకైక అగ్ని ప‌ర్వ‌తం… మ‌న దేశంలో ఉంది..!

అగ్ని ప‌ర్వ‌తాలంటే మ‌నకు ముందుగా అమెరికా, యూర‌ప్‌, ఆఫ్రికా వంటి ఖండాల్లో ఉన్న పెద్ద పెద్ద అగ్ని ప‌ర్వ‌తాలే గుర్తుకు వ‌స్తాయి. పెద్ద ఎత్తున లావా వెద‌జ‌ల్ల‌బ‌డుతూ కొన్ని వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌తో చాలా ప్ర‌మాద‌క‌రంగా ఉంటాయి. అయితే మీకు తెలుసా..? మ‌న దేశంలోనూ ఓ అగ్ని ప‌ర్వ‌తం ఉంద‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌న దేశంలోని అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ ఓ అగ్ని ప‌ర్వ‌తం ఉంది. దాని పేరు బారెన్ ఐలండ్ వ‌ల్క‌నో. అయితే ఇప్పుడిదే అగ్ని ప‌ర్వ‌తానికి చెందిన ఓ హాట్ న్యూస్ ట్రెండింగ్ అవుతోంది. అదేమిటంటే…

barren-island-volcano-a

గ‌త 150 ఏళ్లుగా ఈ బారెన్ ఐలండ్ వ‌ల్క‌నో నిద్రాణ స్థితిలో ఉంద‌ట‌. అంటే చ‌డీ చ‌ప్పుడు లేకుండా, ఎలాంటి లావా రాకుండా చూసేందుకు ఓ ప‌ర్వ‌తంలా మాత్ర‌మే ఉండేది. కానీ మొన్నా మ‌ధ్య నుంచి ఈ అగ్నిప‌ర్వ‌తం లావాను వెద‌జ‌ల్లుతోంద‌ట‌. అంతేకాదు ప్ర‌తి 10 నిమిషాల‌కు ఓ సారి బూడిద‌, నిప్పు ర‌వ్వ‌లు బ‌య‌ట‌కు వెద‌జ‌ల్ల‌బ‌డుతున్నాయ‌ట‌. దీనిపై గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (ఎన్‌ఐవో) పరిశోధకులు తాజాగా ప‌రిశోధ‌న‌లు చేశారు. వారు అగ్ని ప‌ర్వ‌తం నుంచి కొన్ని శాంపిల్స్ సేక‌రించారు. లావా, బూడిద వంటి ప‌దార్థాల‌తోపాటు అక్క‌డి మ‌ట్టిని కొన్ని శాంపిల్స్ సేక‌రించి ప్ర‌యోగాల‌కు పంపారు. వాటిని విశ్లేషిస్తే మ‌రిన్ని వివ‌రాలు తెలుస్తాయి.

barren-island-volcano-b

అయితే ఈ బారెన్ ఐలండ్ వ‌ల్క‌నో మ‌న దేశంలో ఉన్న ఏకైక అగ్ని ప‌ర్వ‌తం అట‌. 150 ఏళ్లుగా ఇది నిద్రాణ స్థితిలో ఉండి, ఇప్ప‌డే మ‌ళ్లీ లావాను వెద‌జ‌ల్లుతుండ‌డంతో దీని వెనుక కార‌ణాలు ఏమిటా అని విశ్లేషించే ప‌నిలో ప‌డ్డారు శాస్త్రవేత్త‌లు. అయితే 1991లోనూ ఓసారి ఇలాగే ఈ అగ్ని ప‌ర్వ‌తం నుంచి బూడిద రాగా కొన్ని రోజుల‌కు మ‌ళ్లీ అది ఆగిపోయింద‌ట‌. మ‌రిప్పుడు అలాగే జ‌రుగుతుందా అంటే ఏమో చెప్ప‌లేమ‌ని సైంటిస్టులు అంటున్నారు. స‌రే… ఏది ఏమైనా… ప‌ర్యాట‌కులు గ‌న‌క దాన్ని చూడాల‌నుకుంటే నిర్భ‌యంగా వెళ్ల‌వ‌చ్చు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. దీని దగ్గరకు వెళ్లాలనుకునే వారికి పోర్ట్‌బ్లెయిర్ నుంచి చార్టర్డ్ బోట్స్ దొరుకుతాయి. అయితే ఇందుకోసం అక్కడి అధికారుల అనుమతి ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top