రహదారి మిగిల్చిన విషాదం.. అందర్నీ విధవలుగా మార్చింది!

అది మహబూబ్ నగర్ లోని  పెద్దకుంట అనే చిన్న గ్రామం. దాదాపు 35 కుటుంబాలు  ఉంటాయి. ఒక్క పురుషుడు తప్ప..ఆ ఊర్లో అందరూ మహిళలే, మరో విషయం ఏంటంటే అందరూ  భర్తను కోల్పోయి విధవలుగా మారిన వారే.  ఆ మిగిలిన ఒకే ఒక వ్యక్తి  65 సంవత్సరాల వృద్దుడు . వారి భర్తలను వారికి దూరం చేసి, వాళ్ళను విధవలుగా మార్చింది ఎవరు తెలుసా? నేషనల్ హైవే 44. అవును ఆ రహదారే వారిని  విధవలుగా చేసింది, వారికి తోడును లేకుండా చేసింది.

వారి ఇండ్లన్నీ రోడ్డుకు ఒకవైపు ఉంటాయ్..వారి పొలాలన్నీ రోడ్డుకు మరో వైపు ఉంటాయ్.. ఏ పని కావాలన్నా వారు రోడ్డును దాటి ఇవతలివైపుకు రావాల్సిందే. అలా వచ్చిన వారిని వచ్చినట్టు కబలించింది ఆ రోడ్డు.

_85785880_3

ఆ ఊరి మహిళల మాటల్లోనే ఆ రహాదారి మిగిల్చిన విషాదం గురించి విందాం:

కొర్ర సకిని( కొడుకుని భర్తను కోల్పోయిన మహిళ)

ఇంటికి వస్తున్న కొడకు…ఇదే రొడ్డు మీద యాక్సిడెంట్ అయి చనిపోయాడు, యేడాది కూడా తిరగక ముందే  నా కొడుకుకు యాక్సిడెంట్ అయిన ప్లేస్ లోనే యాక్సిడెంట్ అయ్యి నా భర్త  కూడా చనిపోయాడు.

నేనావత్ రూక్యా.( భర్తను ముగ్గురు కొడుకులను కోల్పోయిన మహిళ)

ఇదే రోడ్డు ప్రమాదంలో నా భర్త, ముగ్గురు కొడుకులతో పాటు నా అల్లుడు కూడా చనిపోయాడు

కొర్ర పన్ని( భర్తను కోల్పోయిన మహిళ)

మా నిస్సాయత చూసి పక్క ఊర్ల నుండి పురుషులు ఆశగా  వచ్చి ఇక్కడ సంచరిస్తూంటారు. ఏం చెప్పుకోవాలి మా బాధ? ఎవరి చెప్పుకోవాలి?

మొత్తం ఆ ఊరిలో అయిదుగురే చిన్న పిల్లలు.

_85785878_11-1

 

మా  ఆవేదన అంతా ఒక్కటే…. మా భూములను ఫ్యాక్టరీ కి అమ్ముకోడానికి అనుమతినిస్తే ..అమ్ముకొని  ఇక్కడి నుండి ఎటైనా వెళ్ళి బతుకుతాం.. లేకపోతే ఓ బైపాస్ రోడ్డు కట్టిస్తే ఇక్కడే కూలీనాలీ చేసుకొని బతుకుతాం అని అంటారు ఆ ఊరిలో మిగిలిన ఏకైక పురుషుడు దస్తగిరి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top