ప్రస్తుతం ప్రపంచమంతా ఎక్కువగా వినిపిస్తున్న పేరు సెల్ఫీ. ఆ సెల్ఫీ పిచ్చి ఎంతటి పీక్ స్టేజ్ కి వెళ్లిందంటే భోజనం చేస్తున్నా, బాత్ రూంలో ఉన్నా, షాపింగ్ కు వెళ్ళినా, క్లాస్ లో ఉన్నా, ఫ్రెండ్స్ తో కలిసి రైడ్ కు వెళ్తున్నా, అతి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినా.. ఇలా ప్రతి ఒక్కటినీ సెల్ఫీగా బంధించి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో అప్లోడ్ చేసుకుంటూ సంతోషపడుతున్నారు. అన్నీ బాగున్నప్పుడు ఓకె గానీ ఇలాంటి సమయాలలో ఏదో జరిగితే ఆ ఆనందం కాస్తా అటకెక్కుతుంది. ఇక్కడ అలాంటి సంఘటనే జరిగింది.

ఆస్ట్రేలియాకు చెందిన కొందరు విహార యాత్రికులు గుజరాత్ ప్రాంతంలో గల జునఘర్ ను సందర్శిస్తున్నారు. ఒక కొత్త ప్లేస్ కు వచ్చిన ఆనందంలో ఆ గ్రూప్ లోని ఓ మహిళ, తన హ్యాండ్ బ్యాగ్ లోని మొబైల్ తీసి సెల్ఫీ తీసుకోవడానికి సిద్ధమైంది. మొదటి ఫోటో సరిగా రాకపోవడంతో మరోసారి ట్రై చేసింది. కొంచెం వెనక్కి వెళ్లి సెల్ఫీ తీసుకుంటుండగా 10 మీట్లర లోతున్న బావిలో పడింది. పక్కనే ఉన్న తనతోటి టూరిస్ట్ లు ఆమె పడిపోవడం గమనించి సాయం చేయడానికి ముందుకు వచ్చారు కానీ అప్పటికే బావిలో పడి కేకలు వేస్తోంది. ఇంతలో అక్కడున్న గ్రామస్థులు షర్ట్స్ ని ఒక తాడులా చేసి, బావిలో ఉన్న ఆమెకు అందించారు. అలా ఆ తాడును పట్టుకొని ఆమె పైకి వచ్చి తన ప్రాణాలు కాపాడుకుంది. ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఆమె రిస్క్ లో పడితే, తన ప్రాణాలను కాపాడటానికి తన ఫ్రెండ్స్ మరింత రిస్క్ చేశారు. సో, ఫ్రెండ్స్ సెల్ఫీ పిచ్చిలో పడి మిమ్మల్ని మీరు మర్చిపోకండి.