ప్ర‌తి భార‌తీయుడు…సియాచిన్ లో ప‌హారా కాసే సైనికుల గురించి తెల్సుకోవాల్సిందే.! అక్క‌డి ప‌రిస్థితి ఎంత దారుణ‌మంటే..!?

స‌ముద్ర మ‌ట్టానికి 22 వేల అడుగుల ఎత్తు…. 15 సెకండ్లు క‌ద‌ల‌కుండా నిల‌బ‌డితే మ‌నిషి ఆసాంతం గ‌డ్డ క‌ట్టేంతా చ‌లి.! ఎండాకాలంలోనే -35 డిగ్రీ సెల్సియ‌స్ ల ఉష్ణోగ్ర‌త‌….ఇక చ‌లి కాలంలో అయితే -60+ యే…. ఆక్సిజ‌న్ అంద‌క నిద్ర‌లోనే ప్రాణాలు గాల్లో క‌లిసిపోయిన సంఘ‌ట‌నలు…ఇలాంటి భ‌యాన‌క వాతావ‌ర‌ణం సియాచిన్ లో స‌ర్వ‌సాధార‌ణం.

ప్ర‌పంచంలోనే ఎత్తైన యుద్దభూమి సియాచిన్..పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లోని కార‌కోరంలో ఉంది. 13 ఏప్రిల్ 1984 నుండి భార‌త సైన్యం.. దేశ ర‌క్ష‌ణ కోసం ఇక్క‌డ ప‌హారా కాస్తుంది. సియాచిన్ అంటే గులాబీల లోయ అని అర్థం…కానీ వాస్త‌వానికి అది మృత్యులోయ‌…. ఎటు నుండి ఏ మంచు చ‌రియ‌లు విరిగిప‌డ‌తాయో తెలియ‌దు, అమాంతం గాలిలోని ఆక్సీజన్ లెవ‌ల్స్ ఒక్క‌సారిగా ప‌డిపోతాయి.! తిన‌డానికి ఏమి దొర‌క‌దు…. హెలికాఫ్ట‌ర్ల ద్వారా అందించిన ఆహారాన్నే తినాలి..అది కూడా పైనుండి జార‌విడిచిన 10 నిమిషాల్లోపే .,లేదంటే అవి గ‌డ్డ క‌ట్టిపోతాయి. ఇలాంటి ప్ర‌దేశంలో గ‌డుపుతూ మ‌నదేశ ర‌క్ష‌ణను చేప‌డుతున్న జ‌వాన్ల‌కు మ‌న‌మంతా సెల్యూట్ చేయాల్సిందే.

సియాచిన్ మ‌రిన్ని షాకింగ్ విశేషాలు:

  • సియాచిన్ ర‌క్ష‌ణ‌కు గానూ…మ‌న దేశం సెక‌న్ కు 18 వేలు ఖ‌ర్చు చేస్తుంది.( అన్ని క‌లిపి)
  • అక్క‌డి సైనికులు వాడే గ‌న్స్ ను ఎప్పుడూ వేడి నీటిలో ముంచి ఉంచుతారు..లేదంటే అవి మంచుతో జామ్ అయిపోతాయి.
  • ఆక్సిజ‌న్ అంద‌క నిద్ర‌లోనే మ‌ర‌ణించే అవ‌కాశం ఉంటుంది కాబ‌ట్టి., ప‌డుకున్న సైనికుల‌ను మ‌ధ్య మ‌ధ్య‌లో..గాడ్స్ వ‌చ్చి లేపుతారు.! అలా 2 గంట‌ల‌కోసారి లేచి..మ‌ళ్లీ ప‌డుకుంటారు.
  • షేవింగ్ చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే ..ఆ చ‌లికి చ‌ర్మం కూడా ఊడివ‌స్తుంది.
  • మూడు నెల‌ల కంటే ఎక్కువ‌గా ఏ సైనికుడికి ఇక్క‌డ డ్యూటీ వేయ‌రు.!

సియాచిన్ లో అమ‌రులైన మ‌న వీర జ‌వాన్లు:

Comments

comments

Share this post

scroll to top