గ‌డిచిన నెల రోజుల్లో 9 రైళ్లు ప‌ట్టాలు త‌ప్పాయి. రైలు ప్ర‌యాణం చేయాలంటేనే జంకుతున్న ప్ర‌జ‌లు..!

ప్ర‌స్తుతం రైళ్ల‌లో ప్ర‌యాణించాలంటేనే జ‌నాల‌కు భ‌యంగా ఉంది. అవును మ‌రి. ఎందుకంటే విష‌యం అలాంటిది. గ‌డిచిన కొద్ది రోజుల్లో ఏకంగా 9 రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. మ‌రి ప‌రిస్థితి ఇలా ఉన్న‌ప్పుడు ఎవ‌రికి మాత్రం భ‌యం క‌ల‌గ‌దు చెప్పండి. దీంతో చాలా మంది ఇప్పుడు రైలు ప్ర‌యాణం చేసే వారు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. ఎందుకంటే.. ప్ర‌యాణం చేయ‌డం త‌ప్ప‌దు క‌దా. అయితే గ‌డిచిన నెల రోజుల్లో ఎక్క‌డెక్క‌డ రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి, వాటిల్లో ఎంత మందికి గాయాల‌య్యాయి, ఎంద‌రు చ‌నిపోయారు.. వంటి విష‌యాల‌పై ఓ లుక్కేస్తే…

1. ఆగ‌స్టు 19న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌, ఖ‌టౌలిలో ఉత్క‌ల్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ప్ర‌మాదంలో 23 మంది చ‌నిపోయారు, 100 మంది గాయాల పాల‌య్యారు.

2. ఆగ‌స్టు 23న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఔరాయాలో కైఫియ‌త్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ చ‌నిపోలేదు, కానీ 74 మందికి గాయాల‌య్యాయి.

3. ఆగ‌స్టు 25న మ‌హారాష్ట్ర‌లోని ముంబై మ‌హిం స్టేష‌న్‌లో లోక‌ల్ ట్రెయిన్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో 5 మందికి గాయాల‌య్యాయి.

4. ఆగ‌స్టు 29న మ‌హారాష్ట్ర‌లోని అసాన్‌గావ్‌, వాసింద్ రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య దురంతో ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

5. ఈ నెల 7వ తేదీన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సోన్‌భ‌ద్ర జిల్లాలో శ‌క్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఎవ‌రికీ గాయాలు కాలేదు. ఎవ‌రూ చ‌నిపోలేదు.

6. ఈ నెల 7వ తేదీన ఢిల్లీలోని శివాజీ బ్రిడ్జి స్టేష‌న్ వ‌ద్ద రాంచీ-ఢిల్లీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఒక‌రికి గాయాల‌య్యాయి.

7. ఈ నెల 7వ తేదీన మ‌హారాష్ట్ర ఖండాలాలో గూడ్స్ ట్రెయిన్ ప‌ట్టాలు త‌ప్పింది. ఎవ‌రికీ ఏమీ కాలేదు.

8. ఈ నెల 7వ తేదీన త‌మిళ‌నాడులోని చెన్నై బేసిన్ బ్రిడ్జ్ యార్డ్‌లో లోక‌ల్ ట్రెయిన్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లోనూ ఎవ‌రికీ ఏమీ కాలేదు.

9. ఈ నెల 14వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేష‌న్‌లో జ‌మ్ముతావి న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లోనూ ఎవ‌రికీ ఏమీ కాలేదు.

చూశారుగా కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలోనే 9 రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. అన్నీ ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న‌లే. అయితే అస‌లు ఇలా ఎందుకు జ‌రుగుతోంది..? ఇందుకు కార‌ణం ఎవ‌రు..? ప‌్ర‌భుత్వ‌మా..? రైల్వే శాఖా..? లేదంటే స‌రైన మౌలిక వ‌స‌తులు, ర‌క్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డమా..? అంటే అందుకు చివ‌రిదే స‌మాధానంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే… రైళ్ల‌లో ప్ర‌యాణికులకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి, నూత‌న స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌రం అయిన నిధులును స‌రిగ్గా ఖ‌ర్చు చేయ‌డం లేద‌ట‌. ఇందుకు కార‌ణం భార‌తీయ రైల్వే వ‌ద్ద స‌రైన నిధులు లేవ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. దీంతో రైల్వే వ్య‌వ‌స్థలో అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా మారింది. అందుకే ట్రాక్‌ల పునరుద్ధ‌ర‌ణ కూడా స‌రిగ్గా జ‌ర‌గ‌డం లేదు. ఫ‌లితంగా రైలు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి.

2016-17లో రైళ్లు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న‌లో చాలా మంది మృతి చెందారు. గ‌డిచిన 10 ఏళ్ల‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు 1394 వ‌ర‌కు జ‌రిగాయి. వాటిలో 51 శాతం ప్ర‌మాదాలు రైళ్లు ప‌ట్టాలు త‌ప్ప‌డం వ‌ల్ల జ‌రిగిన‌వేన‌ట‌. ఇక ఎన్‌డీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇప్ప‌టి వ‌ర‌కు రైళ్లు ప‌ట్టాలు త‌ప్పిన ఘ‌ట‌న‌లు 346 వ‌ర‌కు జ‌రిగిన‌ట్టు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇన్ని ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నా రైల్వే శాఖ గానీ, అటు కేంద్రం గురించి గానీ ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ బుల్లెట్ ట్రెయిన్‌ను తీసుకువ‌స్తార‌ట‌. అయ్యా.. మీరు బుల్లెట్ ట్రెయిన్‌ను తేకున్నా ఏమీ కాదు, కానీ రైళ్ల‌లో సేఫ్టీ పెంచండి. అవి టైముకు వ‌చ్చేలా చూడండి. సాధార‌ణ‌, పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి టిక్కెట్ రేట్లు అందుబాటులో ఉంచండి, ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చూడండి. అదే జ‌నాల‌కు చాలు..!

Comments

comments

Share this post

scroll to top