వాటర్ తాగేసి..బాటిల్ పాడేస్తున్నారా..? కానీ పడేయకుండా ఇలా చేస్తే…మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు తెలుసా.?

ట్రెయిన్ జర్నీలో టికెట్ ఎంత ముఖ్యమో,వాటర్ బాటిల్ అంతే ముఖ్యం..ఇంటి నుండి మోసుకుని వెళ్లడం కంటే కొనుక్కోవడం బెటర్ అనుకునే వాళ్లే చాలామంది..కొనుక్కున్నాక వాటర్ అన్ని తాగేస్తే..బాటిల్ అక్కడే వదిలేయడమో..లేదంటే కిటికిలోనుండి విసిరి కొట్టడమో చేస్తుంటాం.వాటర్ తాగగా మిగిలితే మాత్రం కొనుక్కున్న నీళ్లని జాగ్రత్తగా ఇంటికి పట్టుకెళ్తుంటారు నాలాంటి కొద్దిమంది..ఇంటికెళ్లాక అవి తాగేసి బాటిల్ పాడేస్తాం.కానీ మేం చెప్పే విషయం చదివితే మాత్రం ఖచ్చితంగా బాటిల్స్ ని పడేయరు…

రైల్లో ప్ర‌యాణం చేసిన‌ప్పుడు కొన్న  వాట‌ర్ బాటిల్‌ను తాగేశాక పారేయొద్ద‌ని చెబుతోంది రైల్వే శాఖ‌. అలా ఖాళీ అయిపోయిన బాటిల్‌ను తిరిగి వారికి ఇస్తే.. డ‌బ్బులు ఇస్తుందట. తాజాగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ.ఈ పథకానికి ప్ర‌యాణికుల నుంచి కూడా విప‌రీత‌మైన స్పంద‌న  వ‌స్తోంది. మ‌రి ఈ క‌థ ఏంటో? డ‌బ్బులు ఎలా వ‌స్తాయో తెలుసుకుందాం ప‌దండి.బాటిల్ పాడేయకుండా ఏం చేయాలి అనే కదా మీ డౌట్..క్రషింగ్ మిషన్లో బాటల్ ని వేయాలి.అలా వేస్తే మాకు డబ్బులు ఎవరిస్తారు,ఎలా ఇస్తారు అదే కదా మీ నెక్ట్స్ క్వశ్చన్…క్ర‌షింగ్ మిష‌న్‌లో బాటిల్ వేస్తే.. మిష‌న్‌కు ఏర్పాటు చేసిన‌ స్క్రీన్‌పై మూడు ఆప్షన్లు వస్తాయి. వస్తువులను కొనుగొలు చేయడానికి ఐదు శాతం డిస్కౌంట్‌తో కూడిన కూపన్ మొదటిది. ఆ డబ్బును డొనేషన్‌గా ఇవ్వడం రెండోది. లేని పక్షంలో ఈ డ‌బ్బుతో మొబైల్ రిచార్జీ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ రైల్ ప్రయాణికుల్లో సూపర్ సక్సెస్‌ అయింది.

ప‌ర్యావ‌ర‌ణంలోకి చేరిపోతున్న ప్లాస్టిక్  వలన ఎంతో ముప్పుందని  మనకు తెలుసు.వాటిల్లో ఎక్కువ ప్లాస్టిక్ బాటిల్స్ వలన నష్టం కలుగుతుంది.  రైళ్ల‌లో ప్ర‌యాణించేవారే ఎక్కువ సంఖ్య‌లో వాట‌ర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నార‌ని వారు చెప్పారు. వాడేసిన ఖాళీ బాటిళ్లు కూడా రైల్వే స్టేష‌న్ల‌లోనే ఎక్కువ‌గా ల‌భిస్తున్నాయ‌ని లెక్క‌లు కూడా చూపించారు పర్యావరణ వేత్తలు.దేశంలోని అన్ని రైల్వే స్టేష‌న్ల‌లోనూ వాడేసి వ‌దిలే ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల సంఖ్య రోజుకు ప‌ది ల‌క్ష‌ల పైమాటేన‌ని ఈ లెక్క‌ల్లో తేలింది. దీంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు..ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ మిష‌న్ల‌ను త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, విజ‌య‌వాడ రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌వేశ పెడ‌తారు. సో..  ఎప్పుడైనా వాట‌ర్ బాటిల్ ఖాళీ చేస్తే.. ఈ మిష‌న్ లో బాటిల్ వేసి  డబ్బు తెచ్చుకోండి.

Comments

comments

Share this post

scroll to top