భార‌తీయ మ‌హిళ‌కు బెర్లిన్ ఎయిర్ పోర్ట్ లో అవ‌మానం..నీ పాలిండ్ల‌ను చూపెట్టు, చనుబాలు పితికి చూపించు అంటూ 45 ని. వేధించిన ఎయిర్ పోర్ట్ భ‌ద్ర‌తా సిబ్బంది.!

బెర్లిన్ ఎయిర్ పోర్ట్ సాక్షిగా…ఓ భార‌త సంత‌తి మ‌హిళ‌పై బెర్లిన్ ఎయిర్ పోర్ట్ భ‌ద్ర‌తా సిబ్బంది అవ‌మాన‌క‌ర రీతిలో ప్ర‌వ‌ర్తించారు. గాయత్రీ బోస్‌ అనే మహిళ సింగపూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల బాబు, ఏడునెలల పాప ఉన్నారు. అయితే ప‌నినిమిత్తం ఆమె పారిస్‌ వెళ్లేందుకు బెర్లిన్‌లోని ఫ్రాంక్‌ఫర్డ్‌ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె లగేజీని ఎక్స్‌రే మిషన్‌ ద్వారా అధికారులు చెక్‌ చేయగా అందులో బ్రెస్ట్‌ పంప్‌ (చిన్నారుల కోసం పాలు పితికే పరికరం) లభ్యమైంది. వెంటనే గాయత్రి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఓ మహిళా పోలీసు అధికారి ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్లి 45 నిమిషాలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

‘‘నువ్వు పాలిచ్చే తల్లివేనా? మాకు నీ మీద‌ అనుమానాలున్నాయ్‌. ఓసారి జాకెట్‌ విప్పు.. చనుబాలు పితికి చూపించు’’ అంటూ ఆ పోలీస్ ఆఫీస‌ర్ ఆమెను బ‌ల‌వంతం చేసింది, చేసేదేమీ లేక‌…పోలీస్ ఆఫీస‌ర్ చెప్పిన‌ట్టే చేసి స‌ద‌రు మ‌హిళ‌ త‌న త‌ల్లిత‌నాన్ని నిరూపించుకోవాల్సి వ‌చ్చింది. బ్రెస్ట్ పంప్ ను కూడా ప‌రిశీలించి …అప్పుడు ఆమె పాస్ పోర్ట్ ను తిరిగిఇచ్చారు.

త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై…ఎయిర్ పోర్ట్ అధికారుల‌ను ప్ర‌శ్నించిన‌..ఆ మ‌హిళ‌కు ..‘‘జరిగిందేదో జరిగిపోయింది.. ఇక వెళ్లు’’అంటూ నిర్ల‌క్ష్య స‌మాధానం ఎదురైంది.  భ‌ద్ర‌త పేరుతో…ఓ తల్లిని ఇలా చ‌నుబాలు పితికి చూపించు అని అడ‌గ‌డం ఏంత వ‌ర‌కు స‌రైన‌ది! అంటూ స‌ద‌రు మ‌హిళ త‌న ఆవేధ‌న‌ను సోష‌ల్ మీడియాలో వ్య‌క్తం చేసింది. మ‌నంమంతా…ఆమెకు అండ‌గా నిల‌బ‌డ‌దాం….బెర్లిన్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఆమెను క్ష‌మాప‌ణ‌లు చెప్పే వ‌ర‌కు వాళ్లు చేసిన కుసంస్కార ప‌నిని అంద‌రికి తెలిసేలా షేర్ చేద్దాం.

Comments

comments

Share this post

scroll to top