అమ్మాయిలను టీజ్ చేసే అబ్బాయిలు..కాస్త వీటి గురించి తెలుసుకోండి.!! అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్!!

ప్రస్తుతం మన దేశంలో  స్త్రీలు ఎదుర్కుంటున్న అతిపెద్ద సమస్య లైంగిక వేధింపులు. ఇంటి దగ్గర, స్కూల్స్, కాలేజీ, బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ చూసినా ఆడవాళ్ళకు లైంగిక వేధింపుల నుండి బయటపడలేక పోతున్నారు. అయితే లైంగిక వేధింపుల నుండి వారిని రక్షించేందుకు, లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు మన ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కొన్ని చట్టాలను ప్రవేశపెట్టారు.  వీటి మీద  వేధించే అబ్బాయిలకు, వేధించడే అమ్మాయిలకు పూర్తిగా అవగాహన లేదు.. అవగాహన ఉంటే వేధించే వాడికి భయం, అమ్మాయికి  వేధింపులను ఎదుర్కొనే ధైర్యం రెండూ వస్తాయి. అందుకే చట్టాలపై అవగాహన కల్పించడం కోసం మా ప్రయత్నం.

1. బహిరంగం ప్రదేశాలలో కానీ మరెక్కడైనా సరే స్త్రీల ముందు అసభ్యకరమైన పాటలు పాడితే, ఆ చర్యను లైంగిక వేధింపుగా పరిగణలోకి తీసుకొని ఐపిసి సెక్షన్ 294 ప్రకారం 3 నెలలు జైలు శిక్ష లేక జరిమానా విధిస్తారు. అలాగే ఒక్కొక్కసారి 3 నెలల జైలు, జరిమానా కూడా కట్టవలసి ఉంటుంది.
1
2. వారికి సెక్స్ చేయడానికి ఇష్టం లేకపోయినా వారిని ఆ విధంగా ప్రేరేపించి ఆధిపత్యం చెలాయించి, ఇలా చేయడం నా హక్కు అని భావించినవారికి ఐపిసి సెక్షన్ 354(ఎ) చట్ట ప్రకారం సంవత్సరం నుండి 3 ఏళ్ళ జైలు శిక్ష లేక జరిమానా విధిస్తారు. ఒక్కోసారి జైలు శిక్ష, ఫైన్ కూడా తప్పవు.
2
3. వారికి తెలియకుండా/ తెలిసినా  వారి వెంటబడుతూ లైంగిక వేధింపులకు పాల్పడితే, ఐపిసి సెక్షన్ 354(డి) చట్ట ప్రకారం 3 నుండి 5 సంవత్సరాల జైలు జీవితం, జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది.
4. శారీరకంగా కలవడానికి ఇష్టంలేని ఆమె, వద్దని వారిస్తున్నా ఆమెపై హత్యాచారానికి పాల్పడినట్లయితే, అలా చేయడం నేరంగా పరిగణలోనికి తీసుకొని ఐపిసి సెక్షన్ 503 నియమం ప్రకారం అతడికి  2 ఏళ్ళ జైలు లేక జరిమానా, కొన్ని సార్లు జైలుతో పాటు జరిమానా కూడా కట్టవలసి ఉంటుంది.
4
5. ఆడవాళ్ళకు తెలియకుండా వాళ్ళ ఫోటోలను, వీడియోలను రహస్యంగా తమ ఫోన్లలో కానీ కెమెరాలలో గానీ బంధించి, లైంగిక వేధింపులకు పాల్పడితే వారిని ఐపిసి 354(సి) సెక్షన్ ప్రకారం 1 నుండి 3 ఏళ్ళ వరకు జైలు శిక్షను విధించే చట్టం ఉంది. ఒకసారి శిక్ష పొంది కూడా మళ్ళీ అలాంటి చర్యలకు పాల్పడితే 3 నుండి 5 ఏళ్ళ దాకా జైలు శిక్ష నుండి తప్పించుకోలేరు.
5
6. ఏదైనా ఫంక్షన్ లోగానీ, ఈవెంట్ లో గానీ లైంగిక వేధింపులకు గురైనట్లయితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిపై ఎఫ్.ఐ. ఆర్ దాఖలు చేయవచ్చు.
7. మీరు పనిచేసే కంపెనీలో తనతో శారీరకంగా పాల్గొనాలని, లేకపోతే పని ఒత్తిడి పెంచుతానని, జీతంలో కోతలు విధించడమే కాక, నీ జీతాన్ని ఇక పెంచేది లేదని లైంగిక వేధింపులు చేస్తున్న బాస్ పై, కేసు పెట్టొచ్చని 2013లో మహిళలు పనిచేసే చోట ఏదైనా సమస్య వస్తే స్పందించాల్సిందిగా చట్టం అమలులోకి వచ్చింది.
8.ఫోటోలను మార్పిడి చేసి, వారిపై కోరికతో వారిని బెదిరిస్తూ లైంగికంగా వేధిస్తే ఐపిసి సెక్షన్ 499 ప్రకారం 2 ఏళ్ళ జైలు జీవితం, జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాలలో రెండిటినీ ఎదుర్కోవలసి ఉంటుంది.
9. ఏదైనా సంస్థలో 10  మందికంటే ఎక్కువగా ఉద్యోగులు ఉన్న సంస్థలో లైంగిక వేధింపులు జరుగుతున్నట్లయితే ఒక కంప్లైంట్ బాక్స్ ను పెట్టి అక్కడ జరుగుతున్న వేధింపులను అందులో తెలుపమని 2013 లో చట్టాన్ని రూపొందించారు.
9
10. ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా, అలాగే ఇతర వ్యక్తులతో ఉన్న ఫోటోలను అందరూ చూసేలా ఆన్ లైన్లో పోస్ట్ చేసి బెదిరిస్తూ లైంగిక వేధింపులు జరిపితే ఐటీ సెక్షన్ 67 కింద ఆ చర్యలకు పాల్పడిన వారిని 2 ఏళ్ళు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది.
11. లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఎవరైనా మహిళలు ఫిర్యాదు చేసినట్లయితే, 90 రోజులలోగా ఆ విచారణ జరపవలసి ఉంటుందని మాహిళా లైంగిక వేధింపు చట్టంలో ఉంది.
12. లైంగిక వేధింపును మొదటి ఫిర్యాదుగా  తీసుకొని, వారిపై నేరం చేసినట్లుగా అధికారులు ముందుకు వెళ్ళవచ్చు.
13. పబ్లిక్ ప్లేస్ లలో లైంగికంగ వేధిస్తూ,ఆమెపై వ్యతిరేకంగ లేనిపోనీ వ్యాఖ్యలు చేసినట్లయితే ఐపిసి సెక్షన్ 509 చట్ట ప్రకారం మూడేళ్ళ జైలు శిక్ష, జరిమానా కట్టవలసి ఉంటుంది.
14. ఆమెతో ఎలాంటి పరిచయాలు లేకపోయినా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేస్తే, ఐపిసి సెక్షన్ 354(ఎ) నియమం ప్రకారం జైలులో వేస్తారు. అ జైలుశిక్ష మూడేళ్ళ వరకూ ఉండవచ్చు.
15. మీ ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేస్తున్నామని వారిపై లైంగికంగా దాడి చేస్తే మహిళా వేధింపు చట్టం 2013 ప్రకారం అతడిపై చర్యలు తీసుకోవచ్చు.
15
16. ఒకవేళ మీరు కానీ లైంగిక వేధింపులకు గురై, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లయితే, మీకు వచ్చిన భాషలో ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదును వారు రికార్డు చేసుకొని, ఇతర అధికారులతో సమస్యపై చర్చించి యాక్షన్ తీసుకుంటారు.
jeans-banned-at-indian-school-over-eve-teasing-1355159778-4431
17. మీరు ఇంటి నుండి ఆఫీస్ నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ ప్రయాణంలో ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే, 2013లో మహిళల కోసం రూపొందించిన లైంగిక వేధింపుల చట్ట ప్రకారం వారిపై ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు.
indian-boys-flirt-flirting-girl-funny
18. ఒక స్త్రీని ఇష్టం వచ్చినట్లు నిందించడం, వారిపై దుర్భాషగా మాట్లాడటం సామాజిక మాధ్యమాలలో (ఫేస్ బుక్, ట్విట్టర్… )ఐపిసి సెక్షన్ 509 నియమం ప్రకారం, అలా చేసిన వారిని 3 ఏళ్ళ శిక్ష మరియు జరిమానా విధిస్తారు.
19.
20. లైంగిక వేధింపులకు గురైనట్లయితే, మీరు వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. వారిపై కటిన చర్యలు తీసుకునేంత వరకూ మీరు ఆ అధికారులను ప్రశ్నించే హక్కు మీకుంది.

Comments

comments

Share this post

scroll to top