అవును…! ఇది యథార్థ కథే, మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో..

చెట్టు మీద తాడుకు ఉరివేసుకొని  ఊయలలా వేలాడిన  రైతుల మృతదేహాలు. మంచినీళ్ల బాటిల్లలో పురుగుల మందు కలుపుకొని తాగి,  పొలం గట్ల దగ్గర అచేతనంగా పడిన రైతన్నల డెడ్ బాడీలు. వంద మైళ్ల వేగంతో వచ్చే రైలు కు ఎదరుగా వెళ్లి చిద్రమైన రైతుల అవయవాలు.. కిరోసిన్  మంటలో మాడిపోయిన రైతన్నల దేహలు..  ఇలా చెప్పుకుంటూ పోతే .. వ్యవసాయం దండగగా మారి  చావును వెతుక్కుంటూ  రైతన్నలు చేసిన ప్రయాణాలు అనేకం.

తెచ్చిన అప్పు కు వడ్డీ పెరిగి, వేసిన పంట చేతికి రాక,  అప్పిచ్చిన వ్యక్తి రోజూ ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తుంటే…  తాళలేక… ఇలా మరణానికి ఏదో ఒక దారి వెతుక్కున్న రైతన్నలు చాలా మందే ఉన్నారు మనదేశంలో . ఈ వీడియో మాత్రం అలాంటి జీవితాల్లో కొత్త కోణాన్ని చూపించింది. రైతన్నల ఇంట్లో ఉండే పిల్లల్లో ఎటువంటి భయాందోళనలు ఉంటాయో అని చూపించింది.

తండ్రి వ్యవసాయానికి వెళుతుంటే భయపడిన పాపను…  ఆకాశంలోని నక్షత్రాలను చూసి ఇది పింకీ వాళ్ల నాన్న, ఇది చిన్నీ వాళ్ల నాన్న అంటూ  లెక్కలేసుకుంటున్న పసిపాప  అమాయకత్వాన్ని చూపించిన క్రమంలో నా ఎమోషన్ కంట్రోల్ కాక… కన్నీరు అలా బుగ్గల మీదకు వచ్చేసింది.

 

Watch Video Here: (Wait For 3 Seconds For Buffering) 

 

Posted by Chantigadu on Thursday, August 20, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top