ఈ 12 మంది ఇండియ‌న్ క్రికెట‌ర్ల భార్య‌ల‌ను చూశారా..? అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు..!

నిజంగా మ‌నం అనుకుంటాం కానీ.. కొన్ని సార్లు కొంద‌రు మహిళ‌ల‌ను చూస్తే హీరోయిన్లకు ఏమీ తీసిపోరు, వారి కంటే ఏమీ త‌క్కువ కారు.. అనిపించే లాంటి అందం ఉండే వారు మ‌న‌కు క‌నిపిస్తారు. అయినా అంద‌రికీ సినిమా ఫీల్డ్ పై ఆస‌క్తి ఉండాలి క‌దా. స‌రే.. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. అస‌లు పై విష‌యాన్నే తీసుకుంటే మ‌న ఇండియ‌న్ క్రికెటర్ల‌కు చెందిన కొంద‌రు భార్య‌లు కూడా స‌రిగ్గా బాలీవుడ్ న‌టీమ‌ణుల‌కు ఏమాత్రం తీసిపోరు అనే విధంగా ఉంటారు. అవును, నిజ‌మే. మ‌రి వారెవ‌రో ఓ లుక్కేద్దామా..!

1. సాక్షి
మ‌హేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి తెలుసు క‌దా. వీరిది ల‌వ్ వివాహం. 2015లో వ‌చ్చిన ధోని బ‌యోపిక్ సినిమా వీరి ల‌వ్ స్టోరీని మ‌న‌కు తెలియ‌జేసింది. ఇక వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు జీవా. అయితే ధోనీ బార్య సాక్షి నిజానికి బాలీవుడ్ హీరోయిన్‌ను పోలిన అందాన్ని క‌లిగి ఉంటుంది.

2. ప్రియాంక
సురేష్ రైనా భార్య ప్రియాంక కూడా చాలా అందంగా ఉంటుంది. ఈమె బ్యాంకింగ్ సెక్టార్‌లో ప‌నిచేస్తుంది. ప‌లు ఎన్‌జీవోల‌తో కల‌సి సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంది కూడా. ఇక వీరి కూతురి పేరు గ్రేషియా రైనా. రైనా, ప్రియాంక జంట‌కు 2015 ఏప్రిల్ 3వ తేదీన వివాహం జ‌రిగింది.

3. న‌టాషా
గౌతం గంభీర్ భార్య పేరు న‌టాషా. ఈమెది కూడా చూపు తిప్పుకోనీయ‌ని అందం. వీరికి 2011 లో వివాహం అయింది. ఈమె బీబీఏ చేసి ప్ర‌స్తుతం అడ్వ‌ర్ట‌యిజింగ్ పీఆర్‌గా ప‌నిచేస్తోంది.

4. రాధికా
అజింక్యా ర‌హానే భార్య పేరు రాధికా. ఈమె అజింక్యాకు చిన్న‌నాటి స్నేహితురాలు. అది ల‌వ్ గా మారింది. అనంత‌రం ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ఈమె కూడా బాలీవుడ్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.

5. నికిత వంజ‌ర
ముర‌ళీ విజ‌య్ భార్య నికిత వంజ‌ర‌. వీరికి 2012లో వివాహం అయింది. ఇద్ద‌రు పిల్ల‌లు.

6. సుష్మిత
మనోజ్ తివారీ భార్య సుష్మిత‌. వీరిద్ద‌రిదీ ల‌వ్ మ్యారేజ్‌. సుష్మిత కూడా చాలా అంద‌గత్తె.

7. పూజా
చెటేశ్వ‌ర్ పుజారా బార్య పేరు పూజా. వీరికి 2013లో వివాహం అయింది. పూజా తండ్రి బిజినెస్ చూసుకుంటుంది. ఆయన ఒక వ‌స్త్ర వ్యాపారి.

8. ప్రీతి
ర‌విచంద్ర‌న్ అశ్విన్ భార్య పేరు ప్రీతి. వీరికి 2011లో వివాహం అయింది. అశ్విన్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు.

9. తాన్యా
బౌల‌ర్ ఉమేష్ యాద‌వ్ భార్య పేరు తాన్యా. ఈమె ఫ్యాష‌న్ డిజైన‌ర్‌.

10. రుష్మా
ఆశిష్ నెహ్రా భార్య రుష్మా. ఈమె ఓ ఎన్ఆర్ఐ. లండ‌న్ వాసి. వీరిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

11. నుపుర్
ఈమె భువ‌నేశ్వ‌ర్ కుమార్ భార్య‌. వీరిద్ద‌రికీ ఇటీవ‌లే వివాహం అయింది.

12. అనుష్క శ‌ర్మ
ఈమె గురించి తెలియ‌ని వారు ఎవ‌రుంటారు. ఈమె స్వ‌త‌హాగా బాలీవుడ్ న‌టి. విరాట్ కోహ్లితో తాజాగా పెళ్ల‌యింది. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ప్రేమికులుగా ఉన్న వీరిద్ద‌రూ ఈ మ‌ధ్యే ఒక్క‌ట‌య్యారు.

Comments

comments

Share this post

scroll to top