పాకిస్తాన్ పైన 1000KG ల బాంబు లు, 300 మంది ఉగ్రవాదులను హతం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్.

‘సర్జికల్ స్ట్రైక్ సినిమా కి సీక్వెల్ తీసుకోండి, మేము చేతులు కట్టుకొని కూర్చోము, మా మీద దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తాము, ఇంకో బాంబు త్వరలోనే పేలనుంది’ ఇవన్నీ పాకిస్తాన్ ప్రజలు మరియు రాజకీయనాయకులు పాకిస్తాన్ లో నివసించే ఉగ్రవాదులు భారత్ కు చెప్పిన మాటలు పుల్వామా దాడి తరువాత, కానీ మన వాళ్ళు మాత్రం పాకిస్తాన్ కి దిమ్మ తిరిగే జవాబిచ్చారు.

సర్జికల్ స్ట్రైక్ సీక్వెల్ ఏ, కానీ సినిమా కాదు.. :

సర్జికల్ స్ట్రైక్ కి సీక్వెల్ ఏ, కానీ ఈ సారి భారీ స్థాయి లో పాకిస్తాన్ పైన దాడి చేసారు, 1000KG ల బాంబు లతో పాకిస్తాన్ లో ఉగ్రవాదుల క్యాంపు ల పైన దాడి చేసారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఈ దాడి లో, ఈ ప్రక్రియ అంత 21 నిమిషాల్లో పూర్తి చేసుకొని తిరిగి ఇండియా లోకి ఎంటర్ అయ్యారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్.

నీ ఇంటికొచ్చి, నీ నట్టింటికొచ్చి మరి లేపేసా..:

సమరసింహా రెడ్డి లో నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అని బాలకృష్ణ డైలాగ్ చెబుతుంటే జనాలు ఏ రేంజ్ లో హంగామా చేసారో, పాకిస్తాన్ లోకే వెళ్లి పాకీ ఉగ్రవాదులను హతం చేసాక మనవాళ్ళు అదే రేంజ్ లో హంగామా చేస్తున్నారు, ఎక్కడ చూసిన పండగ వాతావరణమే, ప్రతి ఒక్క భారతీయుడి మొఖం లో చిరునవ్వు, ఇది కేవలం ఆరంభం మాత్రమే, ముందుండి ముసళ్ల పండగ అని మన గవర్నమెంట్ చెబుతుంది, రానున్న రోజుల్లో పాకిస్తాన్ కి చుక్కలు చూపియ్యడం ఖాయం.

భద్రత పటిష్టం.. :

భారత సరిహద్దుల్లో భద్రత పటిష్టం చేసారు, ఈ సారి వాళ్ళు మళ్ళీ దాడి కి ప్రయత్నిస్తే ఇంక ఊరుకునేది లేదని భారత ప్రభుత్వం హెచ్చరిస్తుంది, యుద్ధం ఏ క్షణాన అయినా మొదలవ్వొచ్చు అని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు, దాడి లో చనిపోయింది ఉగ్రవాదులు కనుక, పాకిస్తాన్ తిరిగి మన పైన దాడి చేస్తే వాళ్ళు బహిరంగంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది, ఇప్పటికే పాక్ ఉగ్రవాదులకు నిలయం అని అందరికి తెలుసు, ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్నట్టు అవుతుంది మన పైన దాడి చేస్తే.

జనాలను కాకుండా.. :

ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి చంపడం హర్షించ దగిన విషయం అని ప్రపంచ దేశాలు భారత్ ను అభినందిస్తున్నాయి, సామాన్య ప్రజలను టార్గెట్ చేసి లేపే అవకాశం ఉన్నా, వారిని బలిగొనడం ఇష్టం లేక కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతమార్చారు, పాకిస్తాన్ కి భారత్ కు ఉన్న వ్యత్యాసం ఇక్కడే అర్ధం అవుతుంది, మేరా భారత్ మహాన్ అని ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకొనే రోజు ఇది.. జై హింద్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top