25 సంవ‌త్స‌రాల లోపు ఉన్న‌వారు, 25 సంవ‌త్స‌రాలు దాటిన వారు త‌ప్ప‌కుండా చూడాల్సిన షార్ట్ ఫిల్మ్.!!

ఓ మ‌ద్య‌త‌ర‌గ‌తి కుర్రాడు…క‌ష్ట‌ప‌డి చ‌దివి సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదిస్తాడు…. నెల‌కు 2.75 ల‌క్ష‌ల జీతం…హ్యాపీగా జీవితం సాగిపోతుందనుకునే త‌రుణంలో…..అస‌లు నా బ‌తుకేంటి? పాస్ పోసుకోడానికి కూడా బాస్ ప‌ర్మీష‌న్ తీసుకోవాల్సిన గ‌తేంటి? అంటూ త‌న‌ని తాను ప్ర‌శ్నించుకుంటూ….త‌న జాబ్ కు రిజైన్ చేసి త‌న‌కిష్ట‌మైన రంగంలో త‌న స‌త్తా చాటాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు…త‌న దృక్ఫ‌థాన్ని మారుస్తాయి.

వాస్త‌వ జీవితాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన షార్టీ:
నిజంగా…ఈ షార్ట్ ఫిల్మ్….వాస్త‌వానికి ద‌గ్గ‌రగా న‌డుస్తుంది.కాదు కాదు…వాస్త‌వంలోనే న‌డుస్తుంది. రెండు సంవ‌త్స‌రాలుగా ఉద్యోగం చేస్తున్న ప్ర‌తి ఉద్యోగి ప్ర‌స్టేష‌న్ ను క‌ళ్ళ‌కుక‌ట్టిన‌ట్టు చూపుతుంది. బాద్య‌త‌ల న‌డుమ మ‌న‌స్సు చంపుకొని మ‌రీ గ‌డియారంలోని ముళ్ళును చూస్తూ…నెల నాడు అకౌంట్ లో క్రెడిట్ అయిన శాల‌రీని చూస్తూ బ‌తికేస్తున్న ఎంతో మంది జీవితాల‌ను ప్ర‌తిబింభిస్తుంది.

యాక్టింగ్..హైలెట్:
ఈ షార్టీలో శివ‌కుమార్ యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి…అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ కు గాను…. శివ‌కుమార్ 2017 సైమా షార్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డ్ ను గెలుచుకున్నాడు. అత‌డి ఎక్స్ ప్రెష‌న్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివ‌రీ….అబ్బో సూప‌ర్ …అత‌ని న‌ట‌న కోస‌మైనా ఈ షార్ట్ ఫిల్మ్ చూడాలంటే అతిశ‌యోక్తి కాదు.!

నిజ‌జీవితాన్ని ప్ర‌తిబింబించిన కొన్ని డైలాగ్స్.

  • 25 ఏళ్ళు వ‌చ్చాక కూడా….నీ లైఫ్ నీకు న‌చ్చ‌లేదంటే… దానికి నువ్వే కార‌ణం.
  • మ‌నిషికి ఫీలింగ్స్ తో పాటు..రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయ్.!
  • నువ్వు కోరుకునే లైప్ కావాలంటే……అవ‌స‌రాల‌కు మించిన‌ ఆస్తైనా ఉండాలి లేదా నిన్ను, నీ అవ‌స‌రాల‌ను పోషించే స‌పోర్ట్ అయినా ఉండాలి.!!

#సైమా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్ట‌ర్ 2017 అవార్డ్ సాధించిన శివ‌కుమార్ కు….ఇంత‌మంచి అంశమున్న షార్టీని తీసిన శ‌శికుమార్ కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు.

Watch Short Film ( Indian Age 25):

Comments

comments

Share this post

scroll to top