ఇండియాలో శృంగార చిత్రాల‌ను “బ్లూ ఫిల్మ్స్ “అని ఎందుకంటారో తెలుసా..?

ఒక‌ప్పుడు క్యాసెట్లు… త‌రువాతి కాలంలో సీడీలు, డీవీడీలు… ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్లు. నీలి చిత్రాలు చూసేందుకు కొంద‌రు ఉప‌యోగిస్తూ వ‌స్తున్న మాధ్య‌మాలు. టెక్నాల‌జీ మారింది క‌దా, మ‌రి అందులోనూ అడ్వాన్స్‌డ్‌గా ఉండ‌వ‌ద్దా..? అందుకే త‌రం మారిన‌ప్పుడ‌ల్లా ఆయా దృశ్యాల నాణ్య‌త మ‌రింత పెరుగుతూ వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా ఫుల్ హెచ్‌డీ క్వాలిటీతో నీలి చిత్రాలు చూస్తున్నారు. అవునూ… ఇంత‌కీ శృంగార చిత్రాలు నీలి రంగులో ఉండ‌వు క‌దా… మ‌రి వాటికి నీలి చిత్రాలు అని పేరు ఎందుకు వ‌చ్చింది..? ఎప్పుడైనా మీరు ఆలోచించారా..? అయితే ఇప్పుడు మాత్రం ఆలోచించ‌కండి. ఎందుకంటే అస‌లు ఆ సినిమాలకు నీలిచిత్రాలు అని పేరు ఎందుకు వ‌చ్చిందో ఇప్పుడు మేం చెప్ప‌బోతున్నాం గ‌న‌క‌.

శృంగార చిత్రాల‌కు నీలి చిత్రాలు అనే పేరు ఎందుకు వ‌చ్చిందో ఇదమిద్దంగా తెలియ‌దు. కానీ చూచాయ‌గా మాత్రం తెలుస్తోంది. ఇంటర్నెట్ ప్ర‌పంచమే ఈ ప్ర‌శ్న‌కు ప‌లు స‌మాధానాలు కూడా చెబుతోంది. అవేమిటంటే… వెన‌క‌టికి శృంగార చిత్రాల పోస్ట‌ర్ల‌ను బ్లూ, వైట్ రంగుల్లో ముద్రించే వారు. సాధార‌ణ సినిమాల‌కు భిన్నంగా అంత‌గా ఆక‌ర్ష‌ణ‌గా ఉండ‌వ‌నే నేప‌థ్యంలోనే ఆ చిత్రాల పోస్ట‌ర్ల‌ను అలా ప్రింట్ చేసేవారు. అయితే కాల‌క్ర‌మేణా అదే యావ‌లో ఆ చిత్రాల‌కు నీలి చిత్రాలు అనే పేరు వ‌చ్చిందని చెబుతున్నారు. ఇప్ప‌టికీ ప‌లు ప్రాంతాల్లో ఇలాంటి పోస్ట‌ర్ల‌ను ప్రింట్ చేసి అంటిస్తున్నార‌ట‌.

blue-film-poster
సాధార‌ణ సినిమాల‌కైతే పెద్ద ఎత్తున బ‌డ్జెట్ పెట్టి చిత్రాల‌ను తీసేందుకు నిర్మాతలు ఆస‌క్తి చూపుతారు. కానీ ఇలాంటి సినిమాల‌ను తీసే వారికి బ‌డ్జెట్ స‌మ‌స్య‌గా ఉంటుంద‌ట‌. అందుకే అప్ప‌ట్లో చాలా త‌క్కువ ఖ‌ర్చుతో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల‌ను తీసేవార‌ట‌. అయితే క‌ల‌ర్ టీవీలో వీక్షించే వారి కోసం ఈ చిత్రాల‌ను క‌ల‌ర్ క‌న్వ‌ర్ట్ కూడా చేసే వార‌ట‌. అలా క‌న్వ‌ర్ట్ చేసే క్ర‌మంలో బ్లాక్ అండ్ వైట్ కాస్తా బ్లూ క‌ల‌ర్‌లోకి మారిపోయేద‌ట‌. దీంతో ఆ చిత్రాల‌కు బ్లూ ఫిలిమ్స్ అనే పేరు వ‌చ్చిందట‌.

ఇక శృంగార చిత్రాల‌కు నీలి చిత్రాలు అనే పేరు ఎందుకు వ‌చ్చిందనే దానిపై మ‌రో జ‌వాబు కూడా మ‌న‌కు ల‌భిస్తోంది. వెన‌క‌టికి శృంగార చిత్రాల‌కు సంబంధించిన క్యాసెట్ల‌ను విక్ర‌యించినా, అద్దెకు ఇచ్చినా నీలి రంగు ప్యాకెట్ల‌లో చుట్టి ఇచ్చేవార‌ట‌. దీంతో ఆ చిత్రాల‌కు నీలి చిత్రాలు అనే పేరు వ‌చ్చిందని చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top