అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యువ భారత్‌కు బీసీసీఐ ఎంత ప్రైజ్ మనీ ఇవ్వబోతుందో తెలుసా.?

అండర్ 19 వాల్డ్ కప్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ ను ఓడించి.. నాలుగో సారి అండర్ – 19 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. 39.5 ఓవర్లలోనే 217 పరుగుల టార్గెట్ ను చేధించింది. ఓపెనర్ మంజోత్ కర్లా సెంచరీ (101) చెలరేగిపోయాడు. దేశాయ్ 47 రన్స్ తో విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసీస్ పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది యంగ్ ఇండియా. శుభమన్ గిల్ 31 పరుగులు చేశాడు. కెప్టెన్ పృద్ధీ 29 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
వాల్డ్ కప్ సిరీస్ లో ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోలేదు యంగ్ ఇండియా. ఇది ప్రపంచ రికార్డ్ కూడా. వరుసగా 4వ సారి అండర్ 19 క్రికెట్ వాల్డ్ కప్ గెలిచి భారత్ సత్తా చాటింది.

కోచ్ ద్రవిడ్, యువ ఆటగాళ్లకు బీసీసీఐ నజరానా:
* రాహుల్ ద్రవిడ్, టీమిండియా హెడ్ కోచ్ – రూ. 50 లక్షలు
* జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 30 లక్షలు
* సపోర్టింగ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు

Comments

comments

Share this post

scroll to top