దటీజ్ ధోని… బంగ్లా పై భారత్ గెలుపు లో 'కీ" రోల్.

ధోని మిస్టర్ కూల్ కెప్టెన్, ఇండియాకు తొలి టిట్వంటీ వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ను కూడా అందించిన సక్సెస్ ఫుల్ కెప్టెన్. పీక్ టైమ్ లో పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోవడం లో అతనిని మించిన వాళ్లు లేరు అనేది మరోసారి ప్రూవ్ అయ్యింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ధోని తెలివైన నిర్ణయం తీసుకొని, కీపింగ్ లో పాదరసం లా కదిలి ఇండియాకు గెలుపునందించాడు. బంగ్లాతో బ్యాచ్ ఫైనల్ ఓవర్  లో 11 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ విజయం సాధిస్తుంది. అప్పటికే అశ్విన్ , జడేజా, నెహ్రా బౌలింగ్ కోటా అయిపోయింది. సో ఫైనల్ ఓవర్ ధోని ఎవరితో వేయిస్తాడోనని అందరిలోనూ ఒకటే ఆతృత.

dhoni

బంతి యువ ఆల్ రౌండర్ హర్ధీక్ పాండ్యా చేతికి ఇచ్చాడు, ధోని… అప్పటికే అతను ఓవర్ కు 10 కి పైగా పరుగులు ఇచ్చి ఉండడంతో చూసే వాళ్లంతా ఈ మ్యాచ్ గోవిందా అనుకున్నారు. అనుకున్నట్టుగానే మొదటి మూడు బంతుల్లో 1,4,4 పరుగులిచ్చాడు….ముఫ్పికర్ రహీమ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి మంచి జోరుమీదున్నాడు.

3 బంతుల్లో2 పరుగులు చేయాలి….క్రీజ్ లో పాతుకుపోయిన ఇద్దరు బ్యాట్సమన్..ఇక ఇండియా గెలుపు కష్టమే  అనుకున్నారు. మూడవ బంతికి రహీమ్ ఔట్, నాల్గవ బంతికి మహ్మదుల్లా ఔట్…చివరి బంతికి 2 పరుగులు చేస్తే బంగ్లాది విజయం, 1 పరుగు చేస్తే మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళుతుంది. చివరి బంతిని ఫేస్ చేయడానికి బ్యాట్స్ మన్ రెడీ గా ఉన్నారు.. హర్ధీక్ బాల్ విసిరాడు…అది బ్యాట్స్ మన్ కు అందకుండా కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది…నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ పరుగు కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు..ధోని మెరుపు వేగంతో వెళ్లి వికేట్లను గిరాటేశాడు….. ఓటమి తప్పదనుకున్న టీమ్ ఇండియా ధోని తెలివైన నిర్ణయం, మెరుపు వేగంతో కదిలి బ్యాట్స్మన్ ను ఔట్ చేయడంతో గెలిచి, వరల్డ్ కప్ వేటలో నిలిచింది.

Comments

comments

Share this post

scroll to top