ఇండియా దెబ్బకు న్యూజీలాండ్ చిత్తు, కివీస్ గడ్డ మీద భారత్ ఆధిపత్యం. అదరగొట్టిన టీం ఇండియా..

కేన్ విలియమ్సన్ మినహా మరెవరు న్యూజీలాండ్ కి అండగా నిలువలేకపోయారు. కేవలం 157 పరుగులు మాత్రమే సాధించగలిగారు న్యూజీలాండ్ బ్యాట్సమెన్. ఆ 157 పరుగులలో కేన్ విలియమ్సన్ 64 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు, అతని తరువాత సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ 24 పరుగులు చేసాక అవుట్ అయ్యాడు. మొదటి మ్యాచ్ లోనే న్యూజీలాండ్ బ్యాట్సమెన్ పేలవ ప్రదర్శన కనబరుస్తారని ఎవరు ఊహించి ఉండరు. వారి సొంత గడ్డ మీద జరుగుతున్న మ్యాచ్ అయినా మన వాళ్ళ డామినేషన్ చూసి ఇండియన్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

కిక్కు రా కిక్కు.. :

మొన్న ఆస్ట్రేలియా గడ్డ పైన ఆస్ట్రేలియా పై టెస్ట్ సిరీస్ తో పాటు, వన్ డే సిరీస్ కూడా గెలిచారు మనోళ్లు, ఇప్పుడు న్యూజీలాండ్ తో న్యూజీలాండ్ లో మొదటి వన్ డే లోనే ఘనవిజయం సాధించి ప్రపంచ కప్ కి ముందు ప్రత్యర్థి టీం లకు సవాలు విసిరారు, కోహ్లీ సేన దూకుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రపంచ కప్ లో కూడా ఇండియన్ ఆటగాళ్ల నుండి ఇలాంటి ప్రదర్శననే ఆశిస్తున్నారు భారత అభిమానులు.

షమీ 3, కుల్దీప్ 4 :

భారత బౌలేర్లే ఇవ్వాల్టి గేమ్ లో కీలక భూమిక పోషించారని చెప్పొచ్చు, భారత బౌలర్ల ధాటికి న్యూజీలాండ్ 157 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ మినహా మిగిలిన న్యూజీలాండ్ బ్యాట్సమెన్ లందరు చేతులెత్తేశారు. కుల్దీప్, చాహల్ స్పిన్ తో విరుచుకుపడ్డారు. షమీ ధాటికి న్యూజ్జీలాండ్ బ్యాట్సమెన్ విలవిలలాడారు.

కోహ్లీ ధావన్ దెబ్బ.. న్యూజీలాండ్ బౌలర్లు అబ్బా..

శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ న్యూజీలాండ్ బౌలర్లను ఉతికారేసారు, లక్ష్యం చిన్నదైనా పిచ్ బౌలింగ్ కి అనుకూలిస్తుండటం తో భారత బ్యాట్సమెన్ లు జాగ్రత్తగా ఆడారు, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ తో 5000 రన్స్ మార్క్ ను అధిగమించాడు. 5000 రన్స్ సాధించిన భారత బ్యాట్సమెన్ లలో అత్యంత వేగంగా 5000 రన్స్ చేసిన రెండవ భారత బ్యాట్సమెన్ గా రికార్డు సృష్టించాడు. ధావన్ కొట్టే 30,40 రన్ లే టీం కి ఎంతో ఉపయోగపడతాయి. ఇంక అతనికి ఊపొస్తే ఎలా ఉంటాదో ఇవ్వాల్టి మ్యాచ్ లో చూసాము, వరల్డ్ కప్ లో ధావన్-రోహిత్ కాంబినేషన్ మీద భారత అభిమానులకి భారీ అంచనాలున్నాయి.

ఎండ వల్ల కొంతసేపు ఆగిన మ్యాచ్.. :

సూర్యుడు తన ప్రతాపాన్ని చూపియ్యడం తో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది, ఎండ డైరెక్ట్ గా కళ్ళ మీద పడుతుండటం తో బ్యాట్సమెన్ లకు ఇబ్బంది కల్గింది. దీంతో మ్యాచ్ ని కాసేపు నిలిపివేశారు. అందువలన భారత్ లక్ష్యాన్ని 158 నుండి 156 కి కుదించారు, ఓవర్లు కూడా 50 నుండి 49 చేసారు.

విరాట్ కోహ్లీ 45 రన్ ల వద్ద అవుట్ అయ్యాడు, తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు కోహ్లీ, భారత్ 35 ఓవర్ లకే లక్ష్యాన్ని చేధించింది. ధావన్ 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Comments

comments

Share this post

scroll to top