T-20 అనగానే గుర్తుకు వచ్చే ఫైనల్ ఓవర్ ఇండియన్ హీరో..జోగిందర్ శర్మ.

గెలుపుఓటములకు అది చివరి ఓవర్, ఒక్క వికెట్ పడగొడితే భారత్ విజయం, ప్రపంచకప్ సొంతం. 13 పరుగులు చేస్తే పాకిస్థాన్ దే ప్రపంచకప్. పాకిస్థాన్ వైపు ఫుల్ స్వింగ్ మీదున్న మిస్బావుల్ హక్ క్రీజులో ఉన్నాడు. అయితే లాస్ట్ ఓవర్ ఎవరికి ఇవ్వాలనేది మిష్టర్ కూల్ కెప్టెన్ ధోని ఆలోచన.. జోగీందర్ శర్మకు చివరి ఓవర్ వేసే అవకాశం ఇచ్చాడు. బౌలర్ గా  బంతులు విసరడం సులభమే కావచ్చు, దాయాదుల మధ్య జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో విశ్వవిజేతలు ఎవరో తేలాల్సిన సమయం అది.అభిమానుల గుండెలు ఎంతో వేగంగా కొట్టుకుంటున్నాయి. జోగీందర్ శర్మ చేతిలో బాల్ పట్టుకొని తనకు అప్పగించిన బాద్యతను నిలబెట్టుకోవాలని, ధోని ఇచ్చిన స్ఫూర్తితో తన ఓవర్ మొదలుపెట్టాడు. ఒక వైడ్ బాల్ వేశాడు, మరో బంతి వేయగా మిస్బా సిక్స్ కొట్టాడు. ఓవర్లో 3 బంతులున్నాయి, పాకిస్థాన్ 6 పరుగులు చేస్తే విజయం వారి సొంతం.

jogi

తనకు అప్పగించిన బాధ్యతను జోగీందర్ నిలబెట్టుకున్నాడు. మిస్బాను పెవిలియన్ పంపించి, 2007 లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్ భారత్ కు దక్కేలా చేశాడు. ఒక్కసారిగా హీరో అయ్యాడు జోగీందర్. దేశమంతా జోగీందర్ పేరును పలుకుతోంది. భారత్ సంబరాలలో ఉంది. 2007 ప్రపంచకప్ భారత్ కైవసం కావడంలో కీలకపాత్ర పోషించిన జోగీందర్ ప్రస్తుతం పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు.హర్యానా డిప్యూటీ సూపరిండెంట్ పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ప్రపంచకప్ టోర్నీ తర్వాత అంతగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడని జోగీందర్, దేశవాలీ, ఐపీఎల్ మ్యాచ్ లలో ఆకట్టుకున్నాడు. భారత్ ను విజయతీరాలకు చేర్చి, క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు  ఏర్పరచుకున్న జోగీందర్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే క్రికెటర్,అలాగే ఆ మ్యాచ్ కూడా.

రీసెంట్ గా టీ20 ప్రపంచకప్ మొదలైంది. భారత్ ఈ మ్యాచ్ లకు ప్రాధాన్యం వహిస్తోంది. భారత్ తొలి మ్యాచ్ న్యూజిలాండ్ తో ఈనెల 15 న జరగనుంది. మరి ఈసారి ప్రపంచకప్ లో భారత్ నుండి ఏ ఆటగాడు చరిత్ర సృష్టించబోతున్నారో.గెలుపుకైనా ఓటమికైనా ఒక్క పరుగుచాలు, జీవితంలో విజయం సాదించాలన్న ఎవరైనా ఒక్కసారే గొప్ప అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నవాడే ఉన్నత ఫలితాలను అందుకోగలడు అని చెప్పడానికి జోగీందరే ఉదాహరణ.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top