అండర్ – 19 మ్యాచ్ లో భారత్ గెలిచిన తర్వాత…”కోచ్ ద్రావిడ్” పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి ఏం చేసారో తెలుసా.?

ఏ ఆట అయినా క్రీడా స్ఫూర్తితో ఆడాలి. అప్పుడే ఆ ఆటకు ఉన్న విలువ పెరుగుతుంది. గెలిచినా, ఓడినా క్రీడాస్ఫూర్తిని మాత్రం మ‌రువ‌కూడ‌దు. ఇది క్రీడాకారుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ను పెంచుతుంది. ఓ జ‌ట్టు ప్ర‌వర్త‌న‌కు అద్దం ప‌డుతుంది. స‌రిగ్గా.. ఇదే స్ఫూర్తిని చాటాడు ఇండియ‌న్ క్రికెట్ జూనియ‌ర్ టీం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌. ఇటీవ‌లే భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై బంప‌ర్ విక్ట‌రీ సాధించి క‌ప్ గెలిచిన విష‌యం తెలిసిందే. అయితే అంత‌కు ముందు పాకిస్థాన్ అండ‌ర్ 19 టీంతో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ భార‌త్ విజ‌యాన్ని సాధించింది. ఈ క్ర‌మంలో ఆ మ్యాచ్ అనంత‌రం టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపాడు.

అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్‌తో జ‌రిగిన‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 272 ప‌రుగులు చేసింది. అందులో భార‌త బ్యాట్స్‌మ‌న్ శుబ్‌మ‌న్ గిల్ 94 బంతుల్లో 102 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక 273 ప‌రుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. భార‌త బౌల‌ర్లు విజృంభించారు. దీంతో ఆ జ‌ట్టు కేవ‌లం 69 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. భార‌త జ‌ట్టు బంపర్ విక్ట‌రీ సాధించింది.

అలా భార‌త్ గెల‌వ‌డం, పాక్ జ‌ట్టు మ‌రీ అంత అత్య‌ల్ప స్కోరుకే ఔట‌వ‌డంతో భార‌త బౌల‌ర్ల‌ను అంద‌రూ ప్ర‌శంసించారు. ఇక పాకిస్థాన్ జ‌ట్టు కోచ్ న‌దీమ్ ఖాన్ కూడా భార‌త జ‌ట్టును, కోచ్ ద్రావిడ్‌ను అభినందించాడు. అయితే ద్రావిడ్ ఆ స‌మ‌యంలోనే క్రీడా స్ఫూర్తిని చాటాడు. పాకిస్థాన్ జ‌ట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆ జ‌ట్టు ఆటగాళ్ల‌లో స్ఫూర్తి నింపే మాట‌లు మాట్లాడాడు. దీనిపై పాక్ కోచ్ న‌దీమ్ ఖాన్ స్పందిస్తూ… క్రికెట్ అంటే జెంటిల్మ‌న్ గేమ్ అని, ద్రావిడ్ ఆ ప‌దానికి స‌రిగ్గా స‌రిపోతాడు.. అంటూ ప‌రోక్షంగా వ్యాఖ్యానిస్తూ ద్రావిడ్‌ను పొగిడాడు. అవును మ‌రి.. ద్రావిడ్ నిజంగా క్రికెట్‌లో జెంటిల్మ‌న్ ఆట‌గాడే. అవును క‌దా..!

Comments

comments

Share this post

scroll to top