భారత జట్టు సరికొత్త జెర్సీ ఇదే..! “ఛాంపియన్స్ ట్రోఫీ”కి ధరించే జెర్సీ ఎలా ఉందో చూడండి!

మనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అసలే ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. మ్యాచ్ ఎవరిదైనా మనం చూడటం మాత్రం పక్క. హైదరాబాద్ మ్యాచ్ అయితే మాత్రం మన టీం గెలవాలి అనుకుంటుంటాము. త్వరలో భారత జట్టు “ఛాంపియన్స్ ట్రోఫీ” ఆడబోతుంది. భారత జట్టు వేసుకునే జెర్సీ చూసే ఉంటారు కదా? డార్క్ బ్లూ రంగులో ఉంటుంది. ఒకసారి లుక్ వేసుకోండి!

ఇన్ని రోజులు స్పాన్సర్ చేసింది “స్టార్”. అందుకే డ్రెస్ మీద “ఇండియా” పైన స్టార్ సింబల్ ఉంది…స్టార్ అని రాసి ఉంటుంది. అంతకముందు “సహారా” అని ఉండేది. ఇప్పుడు ఆ కాంట్రాక్టు అయిపొయింది. సరికొత్త స్పాన్సర్ “ఒప్పో”. సెల్ ఫోన్స్ రంగంలో ప్రస్తుతం దూసుకుపోతున్న ఫోన్ కంపెనీల్లో “ఒప్పో” ఒకటి. ఇప్పుడు “ఒప్పో” స్పాన్సర్ చేస్తున్న “జెర్సీ” ను కొద్దిసేపటి క్రితమే “బీసీసీఐ” ఆఫీసియల్ గా విడుదల చేసింది. ఒప్పో ఎఫ్ – 3 ఫోన్ ఈ రోజు విడుదల అవుతున్న సందర్బంగా కొత్త జెర్సీ ని అధికారికంగా వెలుగులోకి తెచ్చారు. ఇంకా ఆ జెర్సీ ను మన భారత జట్టు ప్లేయర్స్ వేసుకొని ఫోటోలు దిగలేదు. ఈ లోపు ఆ జెర్సీ ఎలా ఉందో చూసేయండి!

చూసారు కదా భారత జట్టు కొత్త జెర్సీని. మీ అభిప్రాయం ఏంటి? బాగుంది అంటారా? ఇంతకముందుండే బాగుందా? కామెంట్స్ లో తెలపండి!

 

Comments

comments

Share this post

scroll to top