ఆ 6 దేశాల ప్రజలకు ఇండియా అంటే…ఎనలేని గౌరవం, ఎందుకో తెలుసా?

భార‌త‌దేశం సంస్కృతి, సంప్ర‌దాయ‌ల‌కు పుట్టినిల్లు. ప్ర‌పంచంలోనే అత్యంత గొప్ప‌ చ‌రిత్ర క‌లిగిన దేశం భార‌త్. అందుకే భార‌త‌దేశ‌మంటే ప్ర‌పంచంలోని చాలా దేశాల‌కు గౌర‌వం, అభిమానం. ఇక్క‌డి సంస్కృతులు సంప్ర‌దాయ‌ల‌ను తెగ ఇష్ట‌ప‌డుతుంటారు. కొన్ని దేశాల ప్రజలైతే ఇక్క‌డే ఉండిపోవ‌డానికి ఇష్ట‌ప‌డతారంటే మ‌న దేశ గొప్ప‌త‌నం ఏంటో ఇట్టే తెలుస్తుంది. మ‌న కంటే అభివృద్దిలో వంద‌ల రెట్లు ముందున్న దేశాలు సైతం మ‌నల‌్ని ఎంతో గౌర‌విస్తున్నాయి. అందుకు కార‌ణాలేంటి.. ఏ ఏ దేశాలకు భార‌త‌దేశ‌మంటే గౌర‌వ‌మో తెలుసుకుందాం..

జపాన్..
ప్ర‌పంచంలోనే టాప్ లో ఉన్న దేశాల్లో ఒక‌టి. అభివృద్దిలో శ‌ర‌వేగంగా దూసుకెళుతుంది. ఈ దేశానికి భార‌త‌దేశ‌మంటే చాలా గౌర‌వం. కార‌ణం వారు పాటిస్తున్న మ‌తం మ‌న దేశంలోనే పుట్ట‌డ‌మే.2562d585-9009-4afe-a158-ddcc840c10a0hires

ఇట‌లీ..
ఇట‌లీ దేశానికి మ‌న సంస్కృతి బాగా న‌చ్చుతుంది. ఈ దేశ‌ కుటుంబ వ్య‌వ‌స్థ భార‌త్ ను పోలి ఉంటుంది. ఉమ్మ‌డి కుటుంబాల‌కి.. బంధాల‌కి. బంధుత్వాల‌కి ప్రాదాన్య‌త నిస్తారు ఇట‌లీ వాసులు. 143271987029kforigners

తైవాన్..
ఈ దేశం వారికి భార‌తదేశ‌మ‌న్న ఇక్క‌డి మ‌నుషులన్న చాలా ఇష్టం. భార‌త ప్ర‌జ‌ల మీద ఎన‌లేని అభిమానాన్ని చూపిస్తారు. కార‌ణం స్నేహ‌భావంతో మెలుగుతార‌ని వారి న‌మ్మ‌కం.

lunch_with_hindu_priests_chidambaram

కంబోడియా..
ఈ దేశంలోని చాలా గుళ్ల‌ల‌లో మ‌న దేవుళ్లున్నాయి. వారి పూజ విధానం కూడా మ‌నకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. భార‌త దేశ సంస్కృతుల‌న్నా, సంప్ర‌దాయ‌ల‌ను చాలా గౌర‌విస్తారు కంబోడియా వాసులు.ty15pongal_1721382f

ర‌ష్యా..
భార‌త‌దేశ‌మంటే ఈ దేశానికి అభిమానం ఎక్కువే. శ‌త్రువుకు శ‌త్రువు మిత్రుడ‌నే నీతిని ఈ దేశం ఎక్కువ‌గా పాటిస్తుంది. భార‌త్ ను అభిమానించాడానికి ప్ర‌ధాన కార‌ణం అమెరికా దృష్టిలో భార‌త్ శ‌త్రుత్వ దేశంగా ఉండ‌టం. ఈ కార‌ణంగానే కార్గిల్ యుద్ద స‌మ‌యంలో భార‌త్ కు అండ‌గా నిలిచింది ర‌ష్యా.photos-awgp_-org-culture

ఇంగ్లాండ్..
నిజానికి భార‌త్ కు ఒక‌ప్పుడు శ‌త్రు రాజ్యంగా ఉన్న ప్ర‌స్తుతం మాత్రం భార‌త్ అంటే ఎన‌లేని గౌర‌వం, అభిమానం. కార‌ణం వేళ ఏళ్లు భార‌త్ ను పాలించిన బ్రిటిష్ వ్య‌వ‌స్థాప‌కులు వెళుతు వెళుతూ ఇక్క‌డి మంచి త‌నాన్ని మూట‌గ‌ట్టుకుని వెళ్ల‌డ‌మే. అందుకే త‌మ దేశంలో భార‌త పౌరుల‌కి ప్ర‌త్యేక స్థానాన్ని ఇచ్చి గౌర‌విస్తోంది ఇంగ్లాండ్.

Comments

comments

Share this post

scroll to top