లంచాల్లో మ‌న‌మే టాప్…చివ‌రి స్థానంలో జ‌పాన్.!!

ఠాగూర్ సినిమాలోని డైలాగ్ గుర్తుందా..?  సినిమా చివ‌ర్లో మెగాస్టార్ చిరంజీవి లంచం గురించి ఓ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్ చెబుతారు క‌దా..! ”మ‌న దేశంలో అడుగ‌డుగునా లంచం… మున్సిపాలిటీ నీళ్లు రావ‌డానికి లంచం, ఇల్లు క‌ట్టుకోవ‌డానికి లంచం, క‌రెంటు ఇవ్వ‌డానికి లంచం, ఆ క‌రెంటు తీయ‌కుండా ఉండ‌డానికి లంచం, రేష‌న్ కార్డుకు లంచం, రేష‌న్ తీసుకోవ‌డానికి లంచం, రైతుల‌కు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు క‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిట‌ల్‌లో బెడ్‌కు లంచం, తినే ఫుడ్డుకు లంచం…” ఇలా సాగుతుంది ఆ డైలాగ్‌. అయితే డైలాగ్ మాత్ర‌మే కాదు, నిజానికి నూటి నూరు పాళ్లు మ‌న దేశంలో జ‌రుగుతుంద‌దే. ఈ క్ర‌మంలో మ‌న దేశం ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలోనే లంచాల్లో నంబ‌ర్ వ‌న్ అయింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఓ సంస్థ చేప‌ట్టిన స‌ర్వేలో తేలిన నిజ‌మిది.

bribes-1
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఓ హ‌క్కుల సంఘం ఇటీవ‌లే ఆయా దేశాల్లో ఉన్న లంచాల తీరుపై ఓ స‌ర్వే చేసింది. అందులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. మ‌న దేశంలో గ‌తంలో క‌న్నా ఇప్పుడు లంచాలు బాగా పెరిగిపోయాయ‌ట‌. అది ఎంతలా అంటే ఏకంగా 41 శాతం పెరుగుద‌ల న‌మోదైంద‌ట‌. దీంతో ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో ఇప్పుడు మ‌న దేశం లంచాల్లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌ట‌. మ‌రి ద్వితీయ స్థానంలో ఉన్న దేశం ఏంటో తెలుసా..?  వియ‌త్నాం. అక్క‌డ 65 శాతం మంది ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ సేవ‌ల కోసం లంచాలు ఇస్తున్నార‌ట‌. ఇక ఈ శాతం మ‌న దేశంలో 69 గా ఉంది. అందుకే లంచాల్లో మ‌న దేశం ఇప్పుడు నంబ‌ర్ వ‌న్ అయింది.

bribes-2
అయితే మ‌రి మ‌న ఇరుగు పొరుగున ఉన్న దేశాలైన పాక్‌, చైనాల ప‌రిస్థితి ఏంట‌ని ఓ సారి చూస్తే… అక్క‌డ కూడా లంచాలు ఇస్తున్నారు, కానీ అది మ‌న క‌న్నా చాలా త‌క్కువ‌గా ఉంది. పాక్‌లో 40 శాతం మంది లంచాలు ఇస్తుండ‌గా, చైనాలో అది 26 శాతం మాత్ర‌మే ఉంది. ఇక జ‌పాన్‌లో ప్ర‌భుత్వ సేవ‌ల కోసం కేవ‌లం 0.2 శాతం మంది మాత్ర‌మే లంచాలు ఇస్తున్నార‌ట‌. అది కూడా ఎప్పుడో ఒక‌టీ అరా కేసులు ఉంటాయ‌ట‌. అంతే. అందుకే ఆ దేశం ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న అభివృద్ధిలో అగ్ర‌స్థానాల్లో దూసుకుపోతుంది. మ‌రి మ‌న దేశం అలా ఎప్పుడు మారుతుందో ఆ దేవుడికే తెలియాలి. అన్నట్టు… మ‌న నేత‌లు చెబుతుంటారు క‌దా… సింగ‌పూర్‌, జ‌పాన్‌లా ఆయా ప్రాంతాలను మారుస్తామ‌ని… మ‌రి ఆ మార్చ‌డ‌మ‌నేది లంచాల్లో జ‌రుగుతుందో లేక కేవ‌లం అభివృద్ధికి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుందో..? ఏమో అస్స‌లు చెప్ప‌లేం..!

Comments

comments

Share this post

scroll to top