ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశంలో పాక్‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చిన భార‌త మ‌హిళా ప్ర‌తినిధి..!

పాకిస్థాన్‌తో మ‌న దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో రెండు ప్ర‌ధాన‌మైన‌వి. ఒక‌టి కాశ్మీర్ స‌మ‌స్య అయితే రెండోది ఉగ్ర‌వాదం. ఉగ్ర‌వాదుల‌తో మ‌న సైనిక శిబిరాల‌పై పాక్ ఎప్ప‌టిక‌ప్పుడు దాడులు చేయిస్తూ క‌వ్విస్తూ ఉంది. ఇక కాశ్మీర్ భూభాగంలోకి కూడా పాక్ చొచ్చుకు వ‌స్తూ భార‌త్‌ను క‌వ్విస్తోంది. అయిన‌ప్ప‌టికీ భార‌త్ సంయ‌మ‌నం పాటిస్తూనే ఉంది. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల్లో మాత్రం భార‌త్ పాక్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టింది. ఆ దేశ విధానాన్ని ప్ర‌పంచ దేశాల‌కు ఎలుగెత్తి చాటి చెప్పింది.

గ‌త నెల 29వ తేదీన జ‌రిగిన ఐక్య‌రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశంలో పాల్గొన్న ఐక్య‌రాజ్య‌స‌మితి భార‌త తొలి కార్య‌ద‌ర్శి ఈన‌మ్ గంభీర్ పాక్‌పై నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ భార‌త్‌పై చేసిన విమ‌ర్శ‌ల‌కు ఆమె స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. పాకిస్థాన్ తనకున్న కాస్త చరిత్రలోనే అంతర్జాతీయ ఉగ్రవాదానికి మారుపేరుగా మారిందన్నారు ఈనమ్. ఇప్పుడు పాక్ అనే పదం ఉగ్రవాదానికి నిర్వచనంలా మారిపోయింది అని స్పష్టం చేశారు. ఉర్దూలో పాక్ అంటే స్వచ్ఛమైనది అని అర్థం. కానీ అందుకు తగినట్లు ఉండటం ఆ దేశం ఎప్పుడో మరచిపోయింది అంటూ ఈన‌మ్ విమ‌ర్శించారు.

ఈన‌మ్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌ను యావ‌త్ భార‌త‌దేశ ప్ర‌జ‌లు స‌మ‌ర్థించారు. ఆమెకు మ‌ద్దతుగా నిలిచారు. ఈ క్ర‌మంలోనే ఐక్య‌రాజ్య స‌మితిలో ఆమె మాట్లాడిన మాట‌ల వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. స‌మావేశంలో పాక్ ప్ర‌ధాని షాహిద్ అబ్బాసీ భార‌త్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈన‌మ్ తిప్పికొట్టారు. కాశ్మీర్‌లో పాక్ జోక్యాన్ని సహించేది లేదని మరోసారి అంతర్జాతీయ వేదికగా తేల్చి చెప్పింది భారత్. కాగా ఈన‌మ్ చేసిన ప్ర‌సంగం ప‌ట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌కు స‌రిగ్గా బుద్ధి చెప్పారంటూ ఆమెను పొగుడుతున్నారు..! ఆమెను భార‌త ప్ర‌జ‌లంద‌రూ నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top