భారత్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు మిధాలీ సొంతం..!

మిథాలి రాజ్ ఇప్పుడు ఏ నోట విన్నా ఇదే మాట..భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్..మన హైదరబాది..ఎన్నో రికార్డులు తన సోంతం చేసుకుంది.ఇప్పుడు మరో అరుదైన రికార్డు తన వశం అయింది. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో ఫైనల్‌కు చేరిన భారత మహిళల జట్టు కప్‌ను మాత్రం గెలవలేకపోయింది. కప్ గెలవకపోతేనేం అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను గెలిచింది.
   
      భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. గతంలో 2005 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. మళ్లీ 12 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుత ప్రపంచకప్‌లో పైనల్‌కు చేరింది. అయితే ఈ రెండు పర్యాయాలు భారత జట్టుకు మిథాలీనే కెప్టెన్‌గా వ్యవహరించింది. దీంతో వన్డే ప్రపంచకప్‌లో రెండు సార్లు జట్టును ఫైనల్స్‌కు చేర్చిన కెప్టెన్‌గా మిథాలీ ఘనత సాధించింది. ఇలా పురుషుల క్రికెట్‌లో ఎప్పుడూ జరగకపోవడం విశేషం.

Comments

comments

Share this post

scroll to top