60 శాతం దేశ సంప‌ద….ఒక్క శాతం మంది దగ్గరే.! ఆశ్చర్యాన్ని కల్గించే లెక్కలిదిగో.!!

ఏ దేశంలోనైనా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వం నుంచి స‌మాన‌మైన లాభాలు అందితేనే అప్పుడు ప్ర‌జ‌లంద‌రి జీవ‌న విధానం బాగుంటుంది. అంద‌రూ ఒకేసారి ప్ర‌గ‌తిప‌థంలో దూసుకెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ శ‌తాబ్దాల కాలం నుంచి జ‌రుగుతుంది ఒక్క‌టే. అది కూడా మ‌న దేశంలోనే ఎక్కువ‌గా జ‌రుగుతోంది. అదేనండీ… పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు రావ‌ల్సిన ఫ‌లాలు స‌రిగ్గా అంద‌డం లేదు. అవి ఏమైనా బడాబాబుల‌కు లాభాన్ని చేకూర్చ‌డం కోసం మాత్ర‌మే ప్ర‌వేశ‌పెట్ట‌బ‌డుతున్నాయి. ఇది మేం చెబుతోంది కాదు, భార‌త్‌లోని ఆర్థిక ప‌రిస్థితులు, ధ‌నిక‌, పేద వ్య‌త్యాసంపై ఓ సంస్థ చేసిన స‌ర్వే ఇది.

rich-poor-difference
స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ న‌గ‌రం తెలుసు క‌దా. అక్క‌డే క్రెడిట్ సూసె గ్రూప్ ఏజీ అని పిల‌వ‌బ‌డే ఓ రీసెర్చ్ సంస్థ ఉంది. అది 2010 నుంచి ఆయా దేశాల ఆర్థిక స్థితి గ‌తులు, ధ‌నిక‌, పేద వ్య‌త్యాసం వంటి ప‌లు అంశాలపై స‌ర్వేలు చేస్తూ ఏటా నివేదిక‌లు ఇస్తోంది. ఈసారి కూడా ఆ సంస్థ స‌ర్వ చేసి ప‌లు ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. అందులో నిజంగా దిమ్మ‌తిరిగే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగుచూశాయి. అవేమిటంటే… మ‌న దేశంలో ఉన్న సంప‌న్నుల శాతం 1 ప‌ర్సెంట్ మాత్ర‌మేన‌ట‌. మిగతా 99 శాతం మంది మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన వారు. అయితే ఆ 1 శాతం ఉన్న ధ‌నికుల వ‌ద్దే దేశంలోని 58.4 శాతం సంప‌ద అంతా నిక్షిప్త‌మై ఉంద‌ట‌. గ‌త రెండేళ్ల క్రితం స‌ద‌రు శాతం 49 ఉండగా, ఇప్పుడ‌ది ఏకంగా 9.4 శాతం పెరిగి 58.4 శాతానికి చేరుకుంద‌ట‌.

అయితే ఇలా సంప‌ద అంతా ధ‌నికుల చేతిలోనే ఉన్న దేశాల్లో మ‌న దేశం 2వ స్థానంలో ఉంద‌ట‌. మొద‌టి స్థానంలో ర‌ష్యా ఉంది. అక్క‌డ 1 శాతం ఉన్న సంప‌న్నుల వ‌ద్ద దేశానికి చెందిన 74.5 శాతం సంప‌ద ఉంద‌ట‌. అంటే మిగిలిన ఆ 26 శాతం సంప‌ద అంతా 99 శాతం మంది చేతిలో ఉన్న‌ట్టే క‌దా. అదే ఆ విష‌యంలో మ‌న ద‌గ్గ‌రికి వస్తే మాత్రం మిగిలిన 42 శాతం సంప‌ద 99 శాతం మంది చేతిలో ఉన్న‌ట్టు లెక్క‌. అంతే క‌దా..! ఇలాంటి షాకింగ్ లెక్క‌ల‌తో ఆ సంస్థ ఏం చెబుతుందంటే… సంప‌దా అంతా ఇలా కేవ‌లం ఒకే వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల వ‌ద్ద ఉండ‌డం వ‌ల్ల దేశ ఆర్థిక ప‌రిస్థితిలో గ‌ణ‌నీయ‌మైన వ్య‌త్యాసాలు, మార్పులు ఉంటాయ‌ట‌. కేవ‌లం ఓ వ‌ర్గానికి చెందిన వారికి మాత్రమే ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ఫ‌లాలు అందితే దేశ ప్ర‌జ‌ల వ‌ద్ద ఉన్న సంప‌ద‌లో ఇలాంటి గ‌ణ‌నీయ‌మైన హెచ్చు త‌గ్గులు ఉంటాయ‌ని తేల్చింది. ఇప్ప‌టికైనా మీకు అర్థం అయ్యే ఉంటుంది… పేద‌లు మ‌రీ పేద‌లుగా ఎందుకు మారుతున్నారో… సంప‌న్నులు ఇంకా సంప‌న్నులుగా ఎందుకు త‌యార‌వుతున్నారో..! మొన్నా మ‌ధ్య ఎస్‌బీఐ బ్యాంక్ అదేదో స్కీం పెట్టి బ‌డాబాబుల రుణాలు మాఫీ చేసింది క‌దా. అందులో లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా కూడా ఉన్నాడు. మ‌రి అలాంటి స్కీంలు (సంక్షేమ ఫ‌లాలు) పెట్టి కార్పొరేట్ వ‌ర్గాల‌ను ఆదుకుంటే ఇక సంప‌ద మొత్తం వారి చేతుల్లోకి ఎందుకు వెళ్ల‌దు చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top