13 వేల పెట్టుబ‌డి – 8 వేల కోట్ల రాబ‌డి

ఎక్క‌డికి వెళ్లినా..ఐస్ క్రీంల‌కు ఉన్నంత డిమాండ్ ఇంకే దానికి ఉండ‌డం లేదు. ఎన్నో కంపెనీలు వాటిని త‌యారు చేస్తున్నాయి. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు తంటాలు ప‌డుతున్నాయి. చెన్నైకి చెందిన ఆర్జీ చంద్ర‌మొగ‌న్ క‌థ మాత్రం వేరు. ఆయ‌న ఐస్ క్రీంలను త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టాడు. పెట్టిన పెట్టుబ‌డి ల‌క్ష‌లు కాదు..జ‌స్ట్ 13 వేల రూపాయ‌లు మాత్ర‌మే. ఆ పెట్టుబ‌డే ఇవాళ 8 వేల కోట్ల రాబ‌డి తీసుకు వ‌చ్చేలా చేసింది. ఇది రియ‌ల్లీ స‌క్సెస్ ఫుల్ స్టోరీ. ఆయ‌న‌కు ఇపుడు 67 ఏళ్ల వ‌య‌సు. కానీ అలా క‌నిపించ‌రు. నిత్యం క‌ష్ట‌ప‌డ‌టం ఆయ‌న నైజం. చెన్నైలోని స్వాంకీ హాట్స‌న్ బిల్డింగ్‌లో స్వంత ఆఫీసులో కొలువుతీరి ఉన్నారు ప్ర‌శాంతంగా. విజ‌య‌పు ద‌ర‌హాసంతో ..ఎన‌లేని ఎన‌ర్జీని స్వంతం చేసుకున్న ఆయ‌న ఏది చెప్పినా అదో పాఠ‌మే. అంత‌లా ప్ర‌భావితం చేస్తున్నారు. అరున్ ఐస్ క్రీమ్స్ భారీ వాటా క‌లిగి ఉన్న‌ది. అతి పెద్ద డెయిరీ సంస్థ‌గా పేరు తెచ్చుకుంది. హాట్స‌న్ ప్రొడ‌క్స్ కు చెన్నై లో ఎన‌లేని డిమాండ్ ఉంటోంది.

విరుధాన‌గ‌ర్ జిల్లాలోని తిరుతంగ‌ల్ కు చెందిన చంద్ర‌మొగ‌న్ 21 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు త‌న క‌ల‌ల‌ను నిజం చేసేందుకు న‌డుం బిగించాడు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా చ‌దువును మ‌ధ్య‌లోనే ఆపేశాడు. అప్పులు ఎక్కువ కావ‌డంతో తీర్చేందుక‌ని ఉన్న ఆస్తిని అమ్మేశాడు. ముగ్గురితో క‌లిసి 250 అడుగుల స్పేస్‌లో రొయ‌పురంలో బిజినెస్ ప్రారంభించాడు. ప‌ది సంవ‌త్స‌రాల పాటు త‌న వ్యాపారాన్ని నిర్వ‌హిస్తూనే వ‌చ్చారు. పాండ్య‌న్, రాజేంద్ర‌న్, ప‌ర‌మ శివ‌న్‌లను నేను మ‌రిచి పోలేనంటారు చంద్ర మొగ‌న్. వీరు త‌న‌కు ఎన‌లేని స‌హాయం చేశార‌ని..త‌న వ్యాపారం విస్త‌రించేందుకు దోహ‌ద ప‌డ్డార‌ని తెలిపారు. కంపెనీ ప్రారంభంలో ల‌క్షా 50 వేల ట‌ర్నోవ‌ర్ సాధిస్తే..1986లో హ‌ట్స‌న్ ఆగ్రో ప్రొడ‌క్ట్స్ పేరుతో రిజిష్ట‌ర్ చేశారు. 3 వేల చ‌ద‌రపు అడుగులో కార్యాల‌యం ఉంది. ఈ కంపెనీలో 8 వేల మంది ప‌నిచేస్తున్నారు.

త‌మిళ‌నాడుతో పాటు క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, గోవా త‌దిత‌ర ప్రాంతాల్లో ఆరోక్య‌, గోమాత ప్రొడ‌క్ట్స్ ల‌భిస్తున్నాయి. డెయిరీ ప్రొడ‌క్ట్స్ త‌యారీ కేంద్రాన్ని కాంచీపురంలో ఏర్పాటు చేశారు చంద్ర‌మోగ‌న్. సేలం, మ‌దురై ప్రాంతాల్లో కూడా బ్రాంచ్‌ల‌ను ఏర్పాటు చేసింది. సౌత్ ఇండియాలో అరుణ్ ఐస్ క్రీమ్స్ పాపుల‌ర్. 1000 దాకా ఐస్ క్రీం పార్ల‌ర్లు ఉన్నాయి. 1000 అవుట్ లెట్స్ , 670 త‌మిళ‌నాడులో కొలువు తీరి ఉన్నాయి. క‌ర్ణాట‌క‌లో 148, కేర‌ళ‌, ఏపీల‌లో కూడా భారీగా ఏర్పాటు చేశారు. త‌మ బిజినెస్‌ను పెంచుకునేందుకు ఇటీవ‌లే ఇబాకో పేరుతో స్టార్ట్ చేసింది. 80 అవుట్ లెట్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో మ‌రింత ఆదాయం స‌మ‌కూరుతోంది. త‌క్కువ ధ‌ర‌…రుచిక‌ర‌మైన ఫ్లేవ‌ర్స్..అంద‌రికీ అందుబాటులో ఉండేలా ప్రొడ‌క్ట్స్ ..ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో అవుట్ లెట్స్ ..ఇదే త‌మ సంస్థ సాధించిన విజ‌యం అంటారు ..న‌ర్మ‌గ‌ర్భంగా చంద్ర‌మొగ‌న్.

Comments

comments

Share this post

scroll to top