మహిళా కబడ్డిలో జరిగిన సంఘటన…ఇరాన్ వాళ్లు ఇండియా గొప్పతనాన్ని కీర్తించిన వేళ.!

అది 2014, ఇంచియాన్ లో జరుగుతున్న ఏసియన్ గేమ్స్ భాగంగా…కబడ్డీ ఆటలో భారత మహిళల జట్టు ఇరాన్ మహిళల జట్టుతో తలపడుతుంది. మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది. పాయింట్ టు పాయింట్ నువ్వా? నేనా అన్నట్టు సాగుతుంది. అప్పటికే  ఆటగాళ్లు రెండు సార్లు ఒకరిమీద ఒకరు అరుసుకున్నారు. ఆటగాళ్ల మధ్య వాతావరణం వేడెక్కింది. అందులోనూ బాడీ టు బాడీ కాంటాక్ట్ ఉన్న ఆట కబడ్డీ కాబట్టి….ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇంతలోనే.. కూతకు వెళ్లింది ఇరాన్ ప్లేయర్….ఆమె మినహా అందరూ ఔట్ అయ్యారు….కాబట్టి తెస్తే పాయింట్ తేవాలి, లేదా అక్కడే ఔట్ అయి రావాలి…ఈ క్రమంలో…వేగంగా రైడ్ చేస్తుంది ఇరాన్ క్రీడాకారిణి…అదే అదునుగా చూసి….కార్నర్ లో ఉన్న భారత క్రీడాకారిణి ఆమెను ఢ్యాష్ ఇచ్చింది. ఈ సమయంలో….ఇరాన్ క్రీడాకారిణి హిజ్జబ్( ముస్లీం మహిళలు తమ ముఖం కనపడకుండా…కప్పి ఉంచే ఓ రకమైన వస్త్రం)  ఊడిపోయింది. అదే గ్యాప్ లో ఇతర క్రీడాకారిణిలు ఆమె మీద పడిపోయారు. ఆమె హిజ్జబ్ ఊడిపోవడాన్ని గమనించిన..ఇండియన్ కబడ్డీ కెప్టెన్ తేజస్వినీ బాయి…వెంటనే ఊడిపోయిన హిజ్జబ్ ను ఆమె తలకు తొడిగి…ఆమెను పంపించింది.

ఏం జరుగుతుందో కాసేపు ఎవ్వరికీ అర్థం కాలేదు…తర్వాత విషయం తెల్సుకున్న చాలామంది తెజస్వినీ క్రీడాస్పూర్తిని మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో అయితే..ఇరాన్ వాళ్లు సైతం తేజస్వినీ కీడాస్పూర్తిని అభినందిస్తూ పోస్ట్స్ చేశారు. ఆట అనంతరం మాట్లాడిన తేజస్వినీ…” వాళ్ల మతాచారాలను గౌరవించాల్సిన బాధ్యత మనఅందరి మీద ఉంది, హిజ్జబ్ ఊడిపోయినప్పుడు ఆమె ఫీల్ అయిన విధానాన్ని అర్థం చేసుకున్నాను…అందుకే  వెంటనే ఆ హిజ్జబ్ ను ఆమె తలకు పెట్టేశాను” అని చెప్పింది.

ఆటలు …ఐక్యమత్యాన్ని, క్రీడాస్పూర్తిని, సహృదయభావాన్ని పెంపొందించేందుకే అనే విషయాన్ని అక్షరాల నిజం అని చూపించిన సంఘటన అది. మనం కూడా తేజస్వినీ బాయి..క్రీడాస్పూర్తిని అభినందిద్దాం.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top