అలీ ని ఏమనాలి? ఈ షోను ఏమనాలి? మనుషుల వీక్ నెస్ తో ఆడుకొవడం అలవాటైపోయింది!!

టివి షోలు మరి  బౌండరీలు దాటిపోతున్నాయ్. జనాన్ని ఎట్రాక్ట్ చేయడం కోసం డ్రామా లను కూడా రియాల్టిగా చూపించి మార్కెట్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. అలాంటిదే  అలీ చేసిన  ఈ  ప్రోగ్రామ్ … మాటల వరకు అయితే ఓకే కానీ ఇక్కడ కంటెస్టెంట్ వీక్ నెస్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశారు. అతని భయాన్ని వీళ్ళు ఫన్ గా ఫీలవుతూ  టివిలో టెలికాస్ట్ చేసిన ప్రోగ్రామ్ పై సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తాయ్.

అలితో జాలీగా అనే ప్రోగ్రామ్ లో జబర్థస్త్ ఫేమ్ ఫణి వచ్చాడు. ఈ ప్రోగ్రామ్ లో  వెనక్కి వెలుతున్న రాడ్ మీద నిలబడి యాంకర్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే ఓ రౌండ్ ఉంటుంది. టైమ్ పెరుగుతున్నా కొద్ది ఆ రాడ్ వెనక్కి వెల్లడం తర్వాత కంటెస్టెంట్ పైనుండి కిందపడిపోవడం జరుగుతాయ్. ఫణికి హైట్ ఫోబియా ఉన్నట్టుంది ..నేను పైకి వెళ్లను సార్ అని చెప్పినా వినకుండా పైకి ఎక్కించారు. అతడు ఎన్ని విధాలుగా బతిమిలాడిన వినకుండా అతడి భయంలో వీళ్ళంతా ఫన్ ఫీలవుతున్నారు.

రౌండ్ స్టార్ట్ అవ్వడం, రాడ్ వెనక్కి వెల్లడం , అక్కడి నుండి పడ్డ ఫణి కింద పడడం జరిగిపోయాయ్.  ఫణి  సొమ్మసిల్లినట్టు పడిపోయాడు. అంతా హైడ్రామా..? ఎం జరుగుతుందో తెలియట్లేదు అంతలోనే…. ఫణి ఇప్పటి దాకా చేసింది  యాక్టింగ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ లేచి డాన్స్ చేశాడు.  అసలు ఏంటి ఇది? . సున్నితమైన మనస్తత్వంగల వారు చూస్తే వారి పరిస్థితి ఏంటి? షోలో ఈ బిల్డప్ లు ఏంటి?  అనేదే ఇప్పుడు ప్రశ్న? ఈ వీడియో చూస్తే మీకింకా క్లారిటీ వస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top