ఫోన్ల‌ను మీరు ఎక్క‌డ పెడ‌తారు. ఈ ప్ర‌దేశాల‌లో పెట్టి వాడ‌కూడ‌దు తెలుసా..?

నేటి త‌రుణంలో సెల్‌ఫోన్లు మ‌న జీవితాల‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. చాలా త‌క్కువ ధ‌ర‌కే ఫోన్లు ల‌భిస్తున్నాయి. దీంతో అనేక మంది చేతుల్లో ఇప్పుడ‌వి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు కూడా చాలా చీప్ ధ‌ర‌ల‌కే వ‌స్తుండ‌డంతో వాటిని కూడా ఎక్కువ మందే వాడుతున్నారు. అయితే ఎలా వాడినా వాటి వ‌ల్ల ప్ర‌మాద‌మే ఉంటుంద‌ని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఫోన్ల‌ను కొన్ని ప్ర‌దేశాల్లో పెట్టడం వ‌ల్ల వాటి నుంచి మ‌న‌కు ముప్పు ఎక్కువగా ఉంటుంద‌ని వైద్యులు అంటున్నారు. మ‌రి ఏయే ప్ర‌దేశాల్లో ఫోన్ల‌ను పెట్ట‌కూడదో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. చార్జ‌ర్ మీద
చాలా మంది ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టి వాటిని కింద పెట్టేందుకు టేబుల్‌, స్టూల్ లాంటిది ఏదీ లేద‌ని చెప్పి వాటిని చార్జ‌ర్‌పైనే పెడ‌తారు. కానీ ఇలా చేయ‌రాదు. దీని వ‌ల్ల రేడియేష‌న్ బాగా వ‌స్తుంద‌ని వైద్యులు అంటున్నారు. క‌నుక ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టిన‌ప్పుడు వాటిని చార్జ‌ర్ల‌పై ఉంచ‌రాదు. అలాగే ఓవ‌ర్ నైట్ చార్జింగ్ కూడా ఫోన్ల‌ను పెట్ట‌రాదు. దాని వ‌ల్ల ఫోన్లు పేలిపోయే ప్ర‌మాదం ఉంటుంది.

2. దిండు కింద
చాలా మంది దిండు కింద ఫోన్ల‌ను పెట్టి నిద్రిస్తారు. ఇలా చేయ‌కూడ‌దు. చేస్తే శ‌రీరంలో మెల‌టోనిన్ ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంది. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా చ‌ర్మ స‌మస్య‌లు వ‌స్తాయి. క‌నుక నిద్రించేట‌ప్పుడు ఫోన్ల‌ను దిండ్ల కింద అస్స‌లు పెట్ట‌రాదు.

3. వెనుక జేబులో
అమ్మాయిల‌కు ఎక్కువగా ఇలా పెట్టుకునే అల‌వాటు ఉంటుంది. కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల ఫోన్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ క‌డుపు నొప్పి, కాలు నొప్పిని క‌లిగిస్తుంది. క‌నుక ఫోన్ల‌ను బ్యాక్ పాకెట్ల‌లో పెట్ట‌రాదు.

4. ముందు జేబులో
పురుషులు ఎక్కువ‌గా ఫోన్ల‌ను ముందు జేబులో పెడ‌తారు. ఇలా చేస్తే ఫోన్ల నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల వీర్య క‌ణాలు నాశ‌నం అవుతాయి. దీంతో సంతానం క‌లిగేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

5. త‌ల ప‌క్క‌న
చాలా మంది నిద్రించేట‌ప్పుడు త‌ల ప‌క్క‌న ఫోన్ల‌ను పెట్టి ప‌డుకుంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మెద‌డులో క‌ణ‌తులు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అది బ్రెయిన్ ట్యూమ‌ర్‌కు దారి తీయ‌వ‌చ్చ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక ఈ ప్ర‌దేశాల్లో త‌ప్ప ఫోన్ల‌ను ఎక్క‌డైనా పెట్టి వాడుకోవచ్చ‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top