మీ ఇంట్లో “మనీ ప్లాంట్” ఉందా.? అయితే 6 విషయాలు తప్పక తెలుసుకోండి.! ఆ డైరెక్షన్ లో పెడితేనే.!

మ‌నీ ప్లాంట్‌… ఈ మొక్క గురించి అంద‌రికీ తెలిసిందే. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే ధ‌నం బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ని, అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. దీంతోపాటు ఈ మొక్క వ‌ల్ల దాని చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణంలో ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంద‌ట‌. అది ఇంట్లోని వారంద‌రికీ చాలా శ‌క్తిని, అదృష్టాన్ని ఇస్తుంద‌ని కూడా కొంద‌రు న‌మ్ముతారు. అయితే ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా, మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్క‌డ పడితే అక్క‌డ పెట్ట‌కూడ‌ద‌ట‌. కొన్ని ప్ర‌త్యేక‌మైన ప్ర‌దేశాల్లోనే దాన్ని ఉంచాల‌ట‌. అప్పుడే మ‌న‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంద‌ట‌. ఇంత‌కీ అస‌లు మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఎక్క‌డ ఉంచాలో, ఎక్క‌డ ఉంచ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా..!

money-plant

  • మ‌నీ ప్లాంట్‌ను ఇంట్లో ఈశాన్య దిశ‌లో (ఉత్త‌రం-తూర్పు మ‌ధ్య‌న‌) ఉంచ‌కూడ‌ద‌ట‌. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధ‌నం అంతా పోతుంద‌ట‌. ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం కూడా బాగుండ‌ద‌ట‌.
  • ఇంట్లో ఏదైనా కుండీలో లేదా ఓ బాటిల్‌లో నీళ్లు నింపి అందులో మ‌నీ ప్లాంట్‌ను పెట్టాల‌ట‌. దీంతో ఇంట్లో ఉన్న వారి ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌ట‌.
  • ఇంట్లో పశ్చిమ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను పెట్ట‌కూడ‌ద‌ట‌. లేదంటే దంప‌తుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు ఎక్కువ‌గా వ‌చ్చి విడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.
  • మ‌నీ ప్లాంట్‌కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాల‌ట‌. దీని వ‌ల్ల ఇంట్లో అంతటా పాజిటివ్ శ‌క్తి నిండిపోతుంద‌ట‌.
  • మ‌నీ ప్లాంట్ మొక్క‌కు ఏర్ప‌డే ఎండిపోయిన‌, చ‌నిపోయిన‌, ప‌సుపు రంగులోకి మారిన ఆకుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించాల‌ట‌. లేదంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్ప‌డుతుంద‌ట‌.
  • ఇంట్లో ఆగ్నేయ దిశ‌లో (తూర్పు-ద‌క్షిణం మ‌ధ్య‌) మ‌నీ ప్లాంట్‌ను ఉంచాల‌ట‌. ఈ దిశ అంటే వినాయ‌కుడికి ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఈ క్ర‌మంలో ఆ దిశ‌లో మ‌నీ ప్లాంట్‌ను ఉంచితే అదృష్టం బాగా క‌ల‌సివ‌స్తుంద‌ట‌. ధ‌నం కూడా బాగా చేకూరుతుంద‌ట‌. ఇంట్లోని వారంద‌రికీ శుభ‌మే క‌లుగుతుంద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top