గ‌త జ‌న్మ‌లో మీరు ఏం చేసేవారో తెలుసా..? ఇదిగో ఇలా తెలుసుకోండి..!

పూర్వ జ‌న్మ‌లో మీరు ఏం చేసేవారో మీకు తెలుసా..? అదేనండీ… ఎవ‌రికైనా పూర్వ జ‌న్మ జ్ఞానం ఉంటుందా..? అని అడుగుతున్నాం. అస్స‌లే ఉండ‌దు. చిన్న‌ప్పుడు జ‌రిగిన విష‌యాలే గుర్తుండ‌వు. ఇక పూర్వ జన్మ జ్ఞానం ఎలా ఉంటుంది..? అందులోనూ ఆ జ‌న్మ‌లో ఏం చేసే వార‌మో ఎలా తెలుస్తుంది..? అస‌లు ఈ జ‌న్మ‌లు అంటూ ఉంటాయా..? అంటే అవును… ఉంటాయ‌ట‌. ప్ర‌ముఖ గ్రీక్ త‌త్వ‌వేత్త పైథాగ‌ర‌స్ పూర్వ జ‌న్మలు ఉంటాయ‌ని చెప్పారు. అంతేకాదు, ఆ జ‌న్మ‌లో ఎవ‌రైనా ఏం చేసేవారో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చ‌ట కూడా. అందుకు ఏం చేయాలంటే…

గ‌త జ‌న్మ‌లో ఎవ‌రైనా ఏం చేసేవారో తెలుసుకోవాలంటే వారి పాస్ట్ లైఫ్ నంబ‌ర్ ను లెక్కించాల్సి ఉంటుంది. అది ఎలా లెక్కించాలంటే… రెండు నంబ‌ర్ల‌ను ముందుగా క‌నిపెట్టాలి. అవి 1. లైఫ్ పాత్ నంబ‌ర్‌. 2. ఇన్న‌ర్ నీడ్ నంబ‌ర్‌.

లైఫ్ పాత్ నంబర్ లెక్కించ‌డం ఎలా అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు ఎవ‌రైనా జూన్ 12, 1960 తేదీన జ‌న్మించార‌నుకుందాం. అప్పుడు వారి లైఫ్ పాత్ నంబ‌ర్ ఏమ‌వుతుందంటే… 06+12+1960 = 1978 మ‌ళ్లీ ఇందులో ఉన్న నాలుగు అంకెల‌ను కూడండి. అప్పుడు 1+9+7+8=25 అవుతుంది. ఇందులో ఉన్న 2 అంకెల‌ను కూడండి. 2+5=7. ఇది లైఫ్ పాత్ నంబ‌ర్ అవుతుంది.

ఇక ఇన్న‌ర్ నీడ్ నంబ‌ర్‌ను ఎలా లెక్కించాలంటే… Priya Sharma అనే పేరు ఉంద‌నుకుందాం. అందులో అచ్చులైన i, a, a, a ల‌ను తీసుకోవాలి. ఇక వీటికి నంబ‌ర్లు ఎలా ఉంటాయంటే A=1; E=5; I=9; O=6; U=3 ప్ర‌కారం ఉంటాయి. ముందు వ‌చ్చిన i, a, a, a ల‌కు ఈ నంబ‌ర్ల‌ను ఇచ్చి వాటిని కూడాలి. అంటే… 9+1+1+1 అవుతుంది. ఈ మొత్తం 12 అవుతుంది. దీన్ని మ‌ళ్లీ కూడితే 1+2=3 అవుతుంది. ఇదే ఇన్న‌ర్ నీడ్ నంబ‌ర్ అవుతుంది.

ఇక పైన వ‌చ్చిన లైఫ్ పాత్ నంబర్ 7, కింద వ‌చ్చిన ఇన్న‌ర్ నీడ్ నంబ‌ర్ 3 ల‌ను కూడాలి. 10 అవుతుంది. దీన్ని మ‌ళ్లీ కూడాలి. 1+0=1 అవుతుంది. ఇదే పాస్ట్ లైఫ్ నంబ‌ర్ అవుతుంది. ఇక ఈ నంబ‌ర్ 1 నుంచి 9 మ‌ధ్య‌లో వ‌స్తుంది. అలా ఎవ‌రికైనా వ‌చ్చే పాస్ట్ లైఫ్ నంబ‌ర్ ను బ‌ట్టి వారు గ‌త జ‌న్మ‌లో ఏం చేసేవారో సులభంగా తెలుసుకోవ‌చ్చు. ఇక 1 నుంచి 9 మ‌ధ్య‌లో వ‌చ్చే ఈ నంబ‌ర్ ప్ర‌కారం గ‌త జ‌న్మ‌లో ఎవ‌రు ఏం చేస్తూ ఉండేవారంటే…

1 అంకె వ‌స్తే…
వీరు గ‌త జ‌న్మ‌లో రాజు, రాణి, పోలీసు, రాజ‌కీయ నాయ‌కుడు అయి ఉంటారు.

2 అంకె వ‌స్తే…
వీరు గ‌త జ‌న్మ‌లో క‌వ‌ల‌లు అయి ఉంటారు. ఏదీ చేయ‌కుండా ఎప్పుడూ ఏదో ఒక‌టి కోల్పోయిన‌ట్టుగా ఉంటారు. స‌మ‌స్య‌ల్లో చిక్కుకుని ఉంటారు.

3 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 3 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో ఆర్టిస్టు లేదా రైట‌ర్ అయి ఉంటారు.

4 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 4 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో సైనికులు లేదా బానిస‌లు అయి ఉంటారు.

5 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 5 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో యోధులు అయి ఉంటారు. యుద్ధాలో చురుగ్గా పాల్గొని ఉంటారు.

6 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 6 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో సస్యాసి, గురువు, బాబా అయి ఉంటారు.

7 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 7 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో వైద్యుడు లేదా వ్యాపారి అయి ఉంటారు.

8 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 8 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో ఆధ్యాత్మిక వేత్త‌, బోధ‌కుడు అయి ఉంటారు.

9 అంకె వ‌స్తే…
పాస్ట్ లైఫ్ నంబ‌ర్ 9 వ‌స్తే వీరు గ‌త జ‌న్మ‌లో జ‌ర్న‌లిస్టు, జ్యోతిష్యుడు లేదా సామాజిక వేత్త అయి ఉంటారు.

Comments

comments

Share this post

scroll to top